కాళోజీ సేవలు మరువలేనివి
ABN, Publish Date - Sep 10 , 2024 | 12:22 AM
ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్‌కమార్ ఝా అన్నారు. కాళోజీ జయంతి వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు
- కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్‌కమార్ ఝా అన్నారు. కాళోజీ జయంతి వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ భాష సంరక్షణకు కాళోజీ కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జడ్పీ సీఈవో వినోద్, డీవైఎస్‌వో రాములు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో..
పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఫసత్ అలీ బేగ్, కౌన్సిలర్లు అన్నారం శ్రీనివాస్, గెంట్యాల శ్రీనివాస్, గడ్డం లత, లింగంపల్లి సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ దార్ల సందీప్, పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కాళోజీ రచనల ద్వారా ప్రజలను జాగృతం చేశారన్నారు.
Updated Date - Sep 10 , 2024 | 12:22 AM