ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఘనంగా సీతారాముల కల్యాణం

ABN, Publish Date - Apr 18 , 2024 | 12:20 AM

శ్రీరామ నవమి సందర్భంగా జిల్లా వ్యాప్తం గా సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.

పెద్దపల్లి కల్చరల్‌, ఏప్రిల్‌ 17 : శ్రీరామ నవమి సందర్భంగా జిల్లా వ్యాప్తం గా సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. జిల్లా కేంద్రం లోని కోదండ రామాలయంలో, హనుమాన్‌ ఆలయాల్లో శ్రీరామనగర్‌లోని శ్రీ రామాలయంలోనూ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిం చారు. ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమ ర్పించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం ప్రక్రియతో పాటు మజ్జిగను అందించారు.

కోల్‌సిటీటౌన్‌ : గోదావరిఖని కోదండ రామాలయంలో సీతారాముల కల్యా ణం బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధానఅర్చకులు మధుసూధనా చార్యులు, అర్చకులు అత్తెణచంద్రశేఖర శర్మ, గిరిధరాచార్యులు, శశిధరాచార్యు లు తదితరులు కల్యాణం నిర్వహించగా, వేలాది మంది భక్తజనం వీక్షించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌-మనాలీ ఠాకూర్‌ దంపతులు పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించి పూజలు చేశారు. పెద్దపల్లి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ, ఏసీపీ రమేష్‌, వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి సీతారా ములను దర్శించుకున్నారు. కల్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, కార్పొరేటర్లు మహాంకాళి స్వామి, బొంతలరాజేష్‌, ముస్తాఫా, బాల రాజ్‌కుమార్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్య క్షుడు తిప్పారపు శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకులు పెదెల్లి ప్రకాష్‌, గట్ల రమేష్‌, ఉల్లంగుల రమేష్‌, ఆలయ ఈవో పాల్గొన్నారు. కాకతీయనగర్‌లోని అభయాంజ నేయస్వామి ఆలయంలో, చంద్రశేఖరనగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో, జీఎంకాలనీలోని సంజీవాంజనేయస్వామి ఆలయంలో, మార్కండేయకాలనీలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద, 48వ డివిజన్‌ భక్తాంజనేయస్వామి ఆలయం లో సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు.

Updated Date - Apr 18 , 2024 | 12:20 AM

Advertising
Advertising