ఫిర్ ఏక్ బార్..
ABN, Publish Date - Jun 05 , 2024 | 12:13 AM
నిజామాబాద్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అర్వింద్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన తన సమీప ప్ర త్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డిపై 10,9,241 ఓట్ల మెజార్టీతో గె లుపొందారు. గత పార్లమెంట్ ఎన్నికలకంటే ఎక్కువ మెజార్టీని సాధించిన ఆయన రెండవ దఫా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
నిజామాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
నిజామాబాద్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అర్వింద్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన తన సమీప ప్ర త్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డిపై 10,9,241 ఓట్ల మెజార్టీతో గె లుపొందారు. గత పార్లమెంట్ ఎన్నికలకంటే ఎక్కువ మెజార్టీని సాధించిన ఆయన రెండవ దఫా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. పార్టీ క్యాడర్ సమష్టి కృషి, మోదీ మానియాతో ఆయనకు భారీ మెజార్టీని నియోజకవర్గ ఓటర్లు కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో 12,33,581 ఓట్లు పోల్ అవగా అందులో ఆయనకు 5,92,318 ఓట్లు వచ్చాయి. పో స్టల్ బ్యాలెట్లతో పాటు సాధారణ ఓట్లు కలిపి ఆయనకు ఈ మెజార్టీని కట్టబెట్టారు. ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి 4,83,077 ఓట్లు సాధించగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి 1,02,406 ఓట్లు సాధించారు. అర్వింద్‌కు భారీ మెజార్టీ మొదటి రౌండ్ నుం చే మొదలైంది. ప్రతిరౌండ్ వారిగా లెక్కించగా అన్ని రౌండ్లలోనూ అర్వింద్‌దే పైచేయిగా మారింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిజామాబా ద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల నియోజకవర్గాల్లో అర్వింద్‌కు మె జార్టీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి నిజామాబాద్ అర్బన్, బోధన్, జగిత్యాల్ నియోజకవర్గాల్లో కొంత మెజార్టీ వచ్చినా మిగతా నాలుగు ని యోజకవర్గాల్లో అర్వింద్‌కు మెజార్టీ వచ్చింది.
మొదటి రౌండ్ నుంచే..
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హవానే కొనసాగింది. పోస్ట ల్ బ్యాలెట్ నుంచి ఈవీఎంల రౌండ్ల వరకు అర్వింద్‌కే ఎక్కువ ఓట్లు వచ్చా యి. ఈవీఎంల రౌండ్లు మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు అర్వింద్ ఆధిక్యత కొనసాగింది. పార్లమెంట్ పరిధిలోని బోధన్, నిజామాబాద్ అర్బన్, జగిత్యాల నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ ఇచ్చినా మిగతా నాలుగు నియోజకవర్గాలైన ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, నిజామాబాద్ రూరల్‌లో ఎక్కువ మెజార్టీ రావడంతో రౌండ్ల వారిగా ఆయ నే ముందున్నారు. కొన్ని వర్గాలు కాంగ్రెస్ అనుకూలంగా ఓట్లు వేసిన రైతు లు, మహిళలు, యూత్ ఎక్కువగా మొగ్గు చూపడం ఈ ఎన్నికల్లో రీజినల్ పార్టీ వైపు మొగ్గకపోవడం వల్ల బీజేపీకి భారీ మెజార్టీ వచ్చింది. కొన్ని రౌం డ్లు ఉత్కంఠ కలిగించిన మొత్తంగా ప్రతి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం ప్రకటించడంతో భారీ మెజార్టీతో గెలుపొందారు.
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ డిచ్‌పల్లిలోని సీఎంసీలో నిర్వహించారు. ఉదయం 8గంటలకే పోస్టల్ బ్యాలెట్‌ను మొదలు పెట్టిన అధికారులు అవి పూర్తి చేసి ఈవీఎం రౌండ్ల వారిగా లెక్కించారు. మొదటి రౌండ్ నుంచి మొ దలు పెట్టగానే బీజేపీ లీడ్ కొనసాగింది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు కొన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి కొంత మేరకు పోటీ ఇచ్చినా బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాత్రం దూరంగానే ఉన్నారు. వీరిద్దరి కంటే భారీగా ఓట్లు తక్కువ ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థికి పోస్టల్ బ్యాలెట్ నుంచి మిగతా అన్నిట్లోనూ ఎక్కువగానే ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆయనకు నాలు గు నియోజకవర్గాలు అండగా నిలిచాయి. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థికంటే అత్యధిక మెజార్టీని కట్టబెట్టాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థికంటే 44,800 ఓట్లు అత్యధికంగా ఓట్లు సాధించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా ఓట్లు మాత్రం ఎక్కువగా బీజేపీ అభ్యర్థికే వచ్చాయి. అన్ని నియోజకవర్గాలకంటే అత్యధికంగా ఈ నియోజకవర్గం నుంచే బీజేపీ అభ్యర్థికి పోల్ అయ్యాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికంటే బీజేపీ అభ్యర్థికి 28,669 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉండగా అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడంతో ఓటింగ్ శా తం పెరిగింది. బాల్కొండ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్య ర్థికంటే 32,172 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఎ మ్మెల్యే ఉన్నా అతితక్కువగా ఆ పార్టీ అభ్యర్థికి ఓట్లు రావడం గమనార్హం. ఈ ని యోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థికి కేవలం 19,643 ఓట్లు మాత్రమే పోల్ అ య్యాయి. కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికంటే బీజేపీ అభ్యర్థికి 32, 952 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉం డగా ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 20,324 ఓట్లు మాత్రమే వచ్చాయి. మిగతా మూ డు నియోజకవర్గాలైన నిజామాబాద్ అర్బన్, జగిత్యాల, బోధన్ నియోజకవర్గా ల్లో బీజేపీ అభ్యర్థి రెండవ స్థానంలో నిలువగా కాంగ్రెస్ అభ్యర్థి మొదటి స్థానం లో నిలిచారు. బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి బీజేపీ అభ్యర్థికంటే 13,194 ఓట్లు అత్యధికంగా వచ్చాయి. జగిత్యాల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికంటే కాంగ్రెస్ అభ్యర్థికి 1847 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 15,809 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి బీజేపీకంటే ఎక్కువగా వచ్చా యి. ఈ నియోజకవర్గాల్లో కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థికి అతితక్కువగా ఓట్లు వ చ్చాయి. నిజామాబాద్ అర్బన్‌లో కేవలం 7,124 ఓట్లు రాగా బోధన్‌లో 7,742 ఓట్లు, జగిత్యాలలో 16,194 ఓట్లు వచ్చాయి. నిజామాబాద్ రూరల్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థికి 22,590, ఆర్మూర్‌లో 8,312 ఓట్లు వచ్చాయి.
నిన్న అలా...నేడు ఇలా..
- జగిత్యాలలో జీవన్ రెడ్డి....కోరుట్లలో అర్వింద్‌లకు భిన్న ఫలితాలు
- అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి...పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు
జగిత్యాల, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): అభ్యర్థులు వారే... అదే పార్టీ... అయిన ప్పటికీ భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు సాధించడం చర్చనీయాంశంగా మారింది. కేవలం కొద్ది రోజుల్లోనే రాజకీయం తారుమారు కావడం విశేషం. నిన్నటికి నిన్న జరిగిన కోరు ట్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయిన ధర్మపురి అ ర్వింద్‌కు ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు సాధించారు. అదేవిధంగా జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీని సాధించారు.
జగిత్యాలలో జీవన్ రెడ్డికి 1,847 మెజార్టీ...
ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్‌పై 1,847 ఓట్ల ఆదిక్యత సాధించారు. జీవన్ రెడ్డికి 76,145 ఓట్లు రాగా అరవింద్‌కు 74,298 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్‌కు 16,194 ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో జగిత్యాల అ సెంబ్లీ నియోజకవర్గంలో ఆధిక్యత ఓట్లను సాధించిన జీవన్‌రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేతిలో ఓడిపోయారు. సంజయ్ కుమార్‌కు 70,243 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 54,421 ఓట్లు వచ్చాయి.
కోరుట్లలో అర్వింద్ హవా...
ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవ న్‌రెడ్డిపై 32,952 ఓట్ల ఆధిక్యతను సాధించారు. అర్వింద్‌కు 92,656 ఓట్లు రాగా జీవన్‌రెడ్డికి 59,794 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్‌కు 20,324 ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కోరుట్ల అసెంబ్లీ నియోజక వ ర్గంలో ఆధిక్యత ఓట్లను సాధించిన అర్వింద్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. కో రుట్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కు 72,115 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు 61,810 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగ్ రావుకు 39,647 ఓట్లు వచ్చాయి.
Updated Date - Jun 05 , 2024 | 12:13 AM