ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బదిలీపై వెళుతున్న కలెక్టర్‌కు ఘనంగా వీడ్కోలు

ABN, Publish Date - Jun 19 , 2024 | 12:23 AM

బదిలీపై వెళుతున్న కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌కు కొత్తగా వచ్చిన కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, పలువురు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

పెద్దపల్లిటౌన్‌, జూన్‌ 18: బదిలీపై వెళుతున్న కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌కు కొత్తగా వచ్చిన కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, పలువురు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఖమ్మం కలెక్టర్‌గా బదిలీపై వెళ్తున కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌కు ఆత్మీయ వీడ్కో లు, జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన కోయ శ్రీహర్షకు స్వాగత కార్యక్రమాన్ని జిల్లా అధికారుల బృందం నిర్వహించారు. కలెక్టర్‌గా వెళ్తున్న కలెక్టర్‌ ముజమ్మి ల్‌ఖాన్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాభివృద్ధి, సంక్షే మం అంశాల్లో జిల్లా ముందుండాలని ఆకాంక్షించా రు. ఉద్యోగి జీవితంలో బదిలీలు సహజమని, మన కు అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియో గం చేసుకోవాలని అన్నారు. జిల్లాలో ప్రతిశాఖ అధి కారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహిం చారని అన్నారు. గత 11నెలల కాలం చాలా మంచి గా గడిచిందని, ప్రభుత్వ లక్ష్యాలను పూర్తిచేయ డంలో, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్ర మాలను అమలుచేయడంలో తనకు స్థానిక ప్రజాప్రతిని ధులు, అదనపు కలెక్టర్‌లు, ఆర్డీవోలు, జిల్లా అధికా రులు, కలెక్టరేట్‌ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించారన్నారు. విద్యా వ్యవస్థలో మంచి మార్పులు తీసుకొని వచ్చే దిశగా లంచ్‌ అండ్‌ లెర్న్‌ బుధవారం, సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహణ, రీడింగ్‌ రూమ్‌ల ఏర్పాటు వంటి వినూత్న కార్యక్రమాలను జిల్లాలో అధికారులు, సిబ్బంది కృషితో అమలు చేశామని తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వ విధులను పకడ్బందీగా నిర్వ హించడంతో పాటు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రతి రోజూ కొంత సమయం నడవాలని సూచించారు. ప్రతి ఉద్యోగి ప్రభుత్వ విధులతో పాటు తన కుటుంబానికి సమయం కేటాయించాలన్నారు. నూతన కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో గత 11నెలల కాలంలో ముజమ్మిల్‌ఖాన్‌ విశేషమైన సేవలు అందిం చారని, ఖమ్మం జిల్లాలో సైతం మంచి సేవలు అందించాలని ఆకాం క్షిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను మరింత అభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్‌ అధికారులు బి.గంగయ్య, హనుమా నాయక్‌, జిల్లా అధికారులు డీఎంవో ప్రవీణ్‌రెడ్డి, డీఏవో ఆదిరెడ్డి, డీఈవో మాధవి, డీఎస్‌వో ప్రేమ్‌కుమార్‌, డీసీవో శ్రీమాల, డీపీఆర్‌వో అయూబ్‌ఖాన్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి, డీఆర్‌డీవో అధికారి రవీం దర్‌, సీపీవో రవీందర్‌, డీఎం సివిల్‌ సప్లై మేనేజర్‌ శ్రీకాంత్‌, జడ్పీ సీఈవో నరేందర్‌, డీడబ్ల్యూవో రవూఫ్‌ఖాన్‌, నాగైలేశ్వర్‌, తెలంగాణ గెజిటెడ్‌ అధి కారుల సంఘం నాయకుడు తూము రవీందర్‌, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2024 | 12:23 AM

Advertising
Advertising