ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పెద్దపల్లి జిల్లాకు చేరిన ఎన్నికల వ్యయ పరిశీలకుడు

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:14 AM

పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చులు పరిశీలించేందుకు వ్యయ పరిశీలకు డు సమీర్‌ నైరంతర్యా జిల్లాకు చేరుకున్నారు.

పెద్దపల్లి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చులు పరిశీలించేందుకు వ్యయ పరిశీలకు డు సమీర్‌ నైరంతర్యా జిల్లాకు చేరుకున్నారు. గురువారం ఉదయం ఆయన కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకోగా ఆయన స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల పరిశీల కులు పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ తన చాంబర్‌లో అదనపు కలెక్టర్‌ జేఅరుణశ్రీతో సమావేశమయ్యారు. జిల్లాలో ఎన్ని కల ఖర్చుల నమోదు కోసం ఏర్పాటుచేసిన ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వేలెన్సు, వీడియో సర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్‌ బృందాలు వాటి పనితీరు తదితర అంశా లను కలెక్టర్‌ వివరించారు. అనంతరం సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేం ద్రాన్ని ఎన్నికల వ్యయ పరిశీలకుడు పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై, టోల్‌ఫ్రీ నంబర్‌, సి విజల్‌యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను కంట్రో ల్‌ రూమ్‌ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ పరిష్కరిస్తున్నామని కంట్రోల్‌రూమ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి వివరించా రు. ఈ కార్యక్రమంలో డీసీవో శ్రీమాల, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి రవీందర్‌ రెడ్డి, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాస్‌, జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు, సోషల్‌ మీడియా ఇన్‌చార్జీ నరహరి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:14 AM

Advertising
Advertising