ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రూ.50 వేలకు మించి తీసుకెళ్లరాదు

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:34 AM

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులో ఉన్నందున ప్రజలు రూ.50 వేలకు మించి తీసుకెళ్లరాదని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. తిప్పాపూర్‌ బస్టాండ్‌ వద్ద పోలీసులు నిర్వహించిన నాకబందీలో భాగంగా వాహనాల తనిఖీని పరిశీలించారు.

తిప్పాపూర్‌ తనిఖీల్లో పాల్గొన్న ఎస్పీ

వేములవాడ రూరల్‌, ఏప్రిల్‌ 26: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులో ఉన్నందున ప్రజలు రూ.50 వేలకు మించి తీసుకెళ్లరాదని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. తిప్పాపూర్‌ బస్టాండ్‌ వద్ద పోలీసులు నిర్వహించిన నాకబందీలో భాగంగా వాహనాల తనిఖీని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల సందర్బంగా జిల్లాలో మద్యం, నగదు, మాదకద్రవ్యాలు, ప్రలోభ పరిచే వస్తువులు సరఫరా కాకుండా జిల్లా సరిహద్దుల్లో, పట్టణాల్లో మండల కేంద్రాల్లో డైనమిక్‌ తనిఖీలు, నాకాబందీ నిర్విహిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. సీజ్‌ చేసిన నగదుకు సంబంధించి సరైన ధృవపత్రాలు సమర్పిస్తే గ్రీవెన్స్‌ కమిటీ ద్వారా రెండు రోజుల్లో రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు వేమలవాడ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో స్ర్టాంగ్‌ రూమ్‌ను పరిశీలించారు. డీఎస్పీ నాగేంద్రచారి, ఆర్డీవో రాజేశ్వర్‌, ఎంఆర్‌వో మహేష్‌, పట్టణ సీఐ వీర ప్రసాద్‌, ఎస్సై అంజయ్య, గోపాల్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఎస్సై దిలీప్‌ ఉన్నారు.

వాహనాలకు సైరన్‌ అమరిస్తే చర్యలు

సిరిసిల్ల క్రైం: నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్‌లు అమరిస్తే చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. శుక్రవారం జిల్లాలో సైరన్‌లు అమర్చిన వాహనాలను సీజ్‌చేసిన వివరాలు వెల్లడించారు. నెల రోజుల్లో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్‌లు బిగించిన ఐదు వాహనాలను సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. త్రిబుల్‌ రైడింగ్‌ చేసిన 159 మందికి జరిమానా విధించామని, కౌన్సెలింగ్‌ ఇచ్చామని తెలిపారు. 23 మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు చేశామని, సైలెన్సర్‌లు బిగించిన 27 వాహనాలను సీజ్‌ చేశామని తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 12:34 AM

Advertising
Advertising