పెరిగిన పసుపు సాగు
ABN, Publish Date - Jul 31 , 2024 | 01:25 AM
దేశంలోనే పసుపు పంట సాగులో ప్రత్యేకత చాటుకున్న జగిత్యాల జిల్లాలో ప్రస్తుత యేడాది సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ ఏడాది పసుపు సాగు విస్తీర్ణం కాస్త ఆశాజనకంగా ఉం ది. 2024-25 సీజన్‌కు సంబంధించి పంట వేయడం పనులను అన్నదా త లు చురుకుగా చేస్తున్నారు. కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల, వేములవాడ అ సెంబ్లీ నియోజకవర్గాల్లో గల పలు మండలాల్లో పసుపు సాగు చేస్తుంటా రు.
జగిత్యాల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే పసుపు పంట సాగులో ప్రత్యేకత చాటుకున్న జగిత్యాల జిల్లాలో ప్రస్తుత యేడాది సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ ఏడాది పసుపు సాగు విస్తీర్ణం కాస్త ఆశాజనకంగా ఉం ది. 2024-25 సీజన్‌కు సంబంధించి పంట వేయడం పనులను అన్నదా త లు చురుకుగా చేస్తున్నారు. కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల, వేములవాడ అ సెంబ్లీ నియోజకవర్గాల్లో గల పలు మండలాల్లో పసుపు సాగు చేస్తుంటా రు. అయితే గత సీజన్‌లో పండించిన పంటకు రికార్డు స్థాయిలో ధరలు రావడంతో ఈ ఏడాది విస్తీర్ణం భారీగా పెరుగుతుందని అందరు అంచ నా వేశారు. కానీ పలు పరిస్థితుల కారణంగా పసుపు సాగు పెరుగుతు న్నప్పటికీ పెంపు అంచనాకు తగ్గట్టుగా సాగు కావడం లేదు. దాదాపుగా జిల్లాలో అయిదు దశాబ్దాలుగా పలు ప్రాంతాల్లో పసుపు సాగవుతుంది. అయిదేళ్ల కిందట వరకు సుమారు నాలుగు నుంచి ఆరు వేల ఎకరాల్లో సగటు విస్తీర్ణంలో పసుపు పంట వేసేవారు. దిగుబడులు తగ్గడం, ధరలు నానాటికి దిగువకు చేరుతుండడంతో రైతుల ఆశలు సన్నగిల్లాయి. ఒక దశలో పెట్టుబడులు కూడా దక్కించుకోలేని స్థితిని ఎదుర్కొన్నారు. ఇక వ దిలించుకుందామని భావించి తగిస్తూ వస్తున్నారు. పదెకరాలు పండించే వారు రెండెకరాలు, రెండెకరాలు వేసేవారు అర ఎకరంతో సరి పెట్టుకున్నా రు. గత యేడాది సుమారు 8 వేల ఎకరాలలో మాత్రమే వేశారు. అనూ హ్యంగా పంటకు క్వింటాకు సగటున రూ. 16 వేల నుంచి గరిష్టంగా రూ. 20 వేల వరకు ఎగబాకింది. సమీపంలోని నిజామాబాద్, సాంగ్లీ మార్కెట్ లలో రూ. 29 వేల వరకు సైతం పలికింది. దీంతో ఈ ఏడాది రైతుల సా గు రెట్టింపు చేస్తారని అంతా బావించారు. ఉద్యానశాఖ అధికారులు కూ డా భారీగానే అంచనాలేశారు. కానీ ఇప్పటివరకు కేవలం సుమారు 10 ఎకరాలకే సాగు పరిమితమైంది. రానున్న రోజుల్లో మరో సుమారు 5 వేల ఎకరాల వరకు సాగు అవుతుందన్న అంచనా ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్‌లో సుమారు 15 వేల ఎకరాలు పసుపు సాగు కానుంది. మొక్కజొన్న పంటలో అంతరపంటగా సైతం పసుపు సాగు చేస్తున్నారు. దీంతో గత యేడాది కంటే పసుపు సాగు పెరిగనట్లయింది.
రైతులకు ఎదురవుతున్న విత్తన కొరత...
జగిత్యాల జిల్లాలో పసుపు ఆశించిన స్థాయిలో సాగు పెరగకపోవడానికి ప్రధాన కారణంగా విత్తన కొరత అని రైతులు అంటున్నారు. ముఖ్యంగా అవసరమైనంత విత్తనం అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కార ణంగా తెలుస్తోంది. కోత దశలోనే పచ్చి పసుపును విత్తనం కోసం నిల్వ చే సే రైతులు ధర పెరిగే సమయానికి తమ వద్ద ఉన్న పసుపు అంతా ఉడి కించడంతో విత్తన కొరత ఏర్పడింది. ఇది సాగు విస్తీర్ణం పెరగకపోవడా నికి ప్రధాన కారణంగా మరిందని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. సమీపంలోని నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదనకుర్తి తదితర ప్రాంతాల రైతుల వద్ద విత్తన పసుపును సేకరించి సాగు పెంచుకునే ప్రయత్నాలు రైతులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పసుపు రైతులకు విత్తన ఎంపిక, ప్రాసెసింగ్, సాగు, చీడపీడల నివారణ తదితర వాటిల్లో సలహాలు, సూచనలు ఇవ్వాలని పసుపు బోర్డు అధికారులు పత్తా లేకపోవడం సైతం రైతులను నిరుత్సాహానికి గురిచేస్తోంది.
పసుపులో అంతర పంటలు..
జిల్లాలో పసుపులో అంతర పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తు న్నారు. పసుపులో మొక్కజొన్న, ఆముదం పంటలను అంతర పంటలు వేసుకుంటూ రైతులు అదనపు ఆదాయం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. పసుపులో మొక్కజొన్నను 2:1 నిష్పత్తిలో, ఆముదాన్ని 10:1 నిష్పత్తిలో వేసుకుంటున్నారు. పసుపులో కందిని వేయాలనుకే రైతులు 9:1 నిష్పత్తిని పాటిస్తున్నారు. కొందరు మామిడి తోటల్లో పసుపును అంతర పంటగా వేసుకుంటున్నారు. పసుపు రైతులు అధిక కుర్కుమిన్ కలిగిన రకాలను వేసుకుంటున్నారు.
పసిడితో పసుపు పంటకు పోలిక...
జిల్లాలో రైతులు పసుపు పంటను పసిడి(బంగారం)తో పోల్చుతుం టా రు. పసుపు దిగుబడితో పాటు ధర ఎక్కువగా ఉన్న సందర్భాల్లో జిల్లా లోని రైతులు శుభాకార్యాలను ఆర్భాటంగా చేస్తుంటారు. ప్రస్తుతం పసుపు ధర ఆశించిన దానికంటే ఎక్కువగా ఉండడం రైతన్నల్లో ఆనందం నిం పింది. పసుపు పంటను ఒక పర్యాయం సాగు చేసిన రైతులు ధర ఎ లా ఉన్నా... వరసగా కనీసం ఎనిమిదేళ్లు సాగు చేయడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఒక యేడాది కాకుంటే మరో యేడాది ధర వస్తుందని, తమ కష్టాలు గట్టెక్కుతాయని రైతులు విశ్వసిస్తుంటారు.
మళ్లీ మంచి రోజులొస్తాయి
- ప్రతాప్ సింగ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, జగిత్యాల
జిల్లాలో పసుపు సాగుకు మళ్లీ మంచి రోజులొస్తున్నాయి. నాణ్యమైన వంగడాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో పంటలేస్తున్నారు. పెట్టుబడిని తగ్గించేందుకు అవసరమైన కార్యచరణ సిద్ధం చేశాం. అంతర్జాతీయంగా కొనుగోళ్లకు డిమాండ్ ఉండడం కలిసొస్తుంది. రానున్న రోజుల్లో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.
మొక్కజొన్నలో అంతరపంటగా పసుపు
- వాణి, జిల్లా వ్యవసాయ అధికారిణి, జగిత్యాల
జిల్లాలో మొక్కజొన్నలో అంతరపంటగా పసుపు సాగు చేస్తున్నారు. గత చివరి సీజన్‌లో పసుపుకు మార్కెట్‌లో గణనీయంగా ధరలు రావడం వల్ల రైతులు ఎక్కువగా పసుపు సాగుకు ముందుకు వస్తున్నారు. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నాము. ఎప్పటికప్పుడు సాగు వివరాలను సేకరిస్తూ ప్రభుత్వానికి నివేదిస్తున్నాము. జిల్లాలో స్పైస్ బోర్డు అధికారుల పర్యటనలు లేవన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకవెళ్తాము.
రెండు ఎకరాల్లో వేశా...
- కూసరి మల్లారెడ్డి, పసుపు రైతు, గ్రామం వెల్ధుర్తి, జగిత్యాల జిల్లా
గతంలో యేటా సుమారు మూడు, నాలుగు ఎకరాలకు తగ్గకుండా పసుపు సాగు చేసేవాడిని.. ధరలు లేవని గత యేడాది ఎకరం వరకే పరిమితం చేశాను. గత సీజన్‌లో గిట్టు బాటు ధర వచ్చిందనే కారణంతో ఈ ఏడాది రెండు ఎకరాలకు పెంచాను. మార్కెట్‌లో డిమాండ్ ఉంటేనే ఏ పంటైనా పండించేందుకు రైతులు కష్ట పడుతారు...ఇష్టపడుతారు. నాణ్యమైన దిగుబడులు పెరిగేలా శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇవ్వాలి.
Updated Date - Jul 31 , 2024 | 01:25 AM