ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే పోటీ..

ABN, Publish Date - Apr 28 , 2024 | 12:07 AM

దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ అన్నారు.

గోదావరిఖని, ఏప్రిల్‌ 27: దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ అన్నారు. శనివారం గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లను కాంగ్రెస్‌ పార్టీ గెలుచు కుంటుందన్నారు. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎలా పట్టం కట్టారో అదే విధంగా దేశంలో కూడా పట్టం కట్టనున్నట్టు చెప్పారు. దేశంలో రోజు రోజుకు కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆధరణ పెరుగుతుందని, దీనిని చూసి ఓర్వలేక ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌ పార్టీ అనుచిత వాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రవే శపెట్టిన మేనిఫెస్టోలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను పొందుపర్చినట్టు చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్‌లో గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రతి కార్యకర్త కాంగ్రెస్‌ గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే పోటీ ఉందన్నారు. ఈ సమా వేశంలో ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌రావు, పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీ, కార్పొరేటర్లు బొంతల రాజేష్‌, మహంకాళి స్వామి పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:07 AM

Advertising
Advertising