తెలంగాణ పోరాట స్ఫూర్తికి ప్రతీక చాకలి ఐలమ్మ
ABN, Publish Date - Sep 11 , 2024 | 12:38 AM
తెలంగాణ పోరా ట స్ఫూర్తికి ప్రతీకగా వీరవనిత చాకలి ఐలమ్మ నిలు స్తుందని అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ అన్నారు.
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 10: తెలంగాణ పోరా ట స్ఫూర్తికి ప్రతీకగా వీరవనిత చాకలి ఐలమ్మ నిలు స్తుందని అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్ర మంలో పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ మహిళా శక్తికి ప్రతీక అని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసి వీర వనితగా చరిత్ర లో నిలిచిపోయారని, ఆమెను స్మరించుకోవాల్సిన అవ సరం ఉందన్నారు. సంఘ సేవకురాలుగా,భూమి, భుక్తి కోసం, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పో రాటపటిమ స్ఫూర్తిదాయకం అని, ఆమె ఆశయాలను కొనసాగించా లని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృ ద్ధి శాఖ అధికారి అనిల్‌కుమార్, రజక సంఘ నాయకులు, అధికా రులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 11 , 2024 | 12:38 AM