ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రుణమాఫీ కాకూడదనేది బీఆర్‌ఎస్‌ ఆంతర్యం

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:27 AM

రుణమాఫీ కాకూడదనేదే బీఆర్‌ఎస్‌ ఆంతర్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ అర్బన్‌ మండలంలోని చీర్లవంచలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

వేములవాడ రూరల్‌, ఏప్రిల్‌ 26: రుణమాఫీ కాకూడదనేదే బీఆర్‌ఎస్‌ ఆంతర్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ అర్బన్‌ మండలంలోని చీర్లవంచలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీలోగా రెతులకు రుణ మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారని, దీనిపై ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ రుణమాఫీ సాఽధ్యం కాదనడం, చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనమా చేస్తాననడం హాస్యాస్పదమని అన్నారు. హరీష్‌రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. దేవుడి పేరిట బీజేపీ రాజకీయాలు చేస్తోందని, జన్‌దన్‌ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామని బీజేపీ ప్రజలను మోసం చేసిందని అన్నారు. జీఎస్టీ పేరిట బీజేపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావును అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేలా ప్రతీ కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రం రాజు, జిల్లా బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు కత్తి కనుకయ్య, ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చెర్ల మల్లేశం, కిసాన్‌ సెల్‌ మండల అధ్యక్షుడు ఇటిక్యాల లింగయ్య, బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు బోనాల రమేష్‌, గ్రామ అధ్యక్షుడు ఈర్నాల గణేష్‌, వైస్‌ ఎంపీపీ వనపర్తి దేవరాజు, ఎంపీటీసీలు బాస రాజశేఖర్‌, గాలిపెల్లి సువర్ణ స్వామి, వనపట్ల ప్రభాకర్‌, ఎర్రం సత్తయ్య, ఎర్రం ఆగయ్య, కుర్మ రవి, మారం రాములు, మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:27 AM

Advertising
Advertising