ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి
ABN, Publish Date - Aug 24 , 2024 | 12:40 AM
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
పెద్దపల్లిటౌన్, ఆగస్టు 23: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం జిల్లా ఆసు పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీబ్లాక్‌ను పరిశీలించిన కలెక్టర్ ప్రతిరోజు వస్తున్న ఔట్‌పేషెంట్ వివరాలను అడిగితెలుసుకున్నారు. రోజుకు దాదాపు 800 మందికి పైగా ఔట్ పేషెంట్ నమోదవుతున్నాయని, అధికంగా వైరల్ జ్వరాలకు సంబంధించిన కేసులు వస్తున్నాయని వైద్యాధికారులు తెలుపగా, ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా వైరల్ జ్వరాల ఓపీ కేసులు వస్తున్నాయో నివేదికను రూపొందించి సమర్పించాలని డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు. ఆసుపత్రిలో జనరల్ వార్డ్ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్‌లను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం 72మందికి ఇన్‌పేషెంట్ సేవలు అందిస్తున్నామని అధికారులు తెలుపగా, ఆసుపత్రిలో అవసరమైతే పడకల సంఖ్య పెంచే విధంగా సిద్ధంగా ఉండాలని సూ చించారు. ఆసుపత్రికి వైద్యులు సకాలంలో హాజరయ్యే విధంగా చూడాలని, ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు ఉచితంగా అం దజేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న ఆయుష్ కేంద్రం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికా రులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 24 , 2024 | 12:40 AM