ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏబీవీపీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ముట్టడికి యత్నం

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:55 PM

శాతవాహన యూనివర్సిటీలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం శాతవాహన యూనివర్సిటీ ఎదుట ధర్నా నిన్వహించి ముట్టడికి యత్నించారు. పోలిసులు వారిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.

గణేశ్‌నగర్‌, సెప్టెంబరు 10: శాతవాహన యూనివర్సిటీలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం శాతవాహన యూనివర్సిటీ ఎదుట ధర్నా నిన్వహించి ముట్టడికి యత్నించారు. పోలిసులు వారిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సదర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్‌, యూనివర్సిటీ నాయకులు రాష్ట్ర కార్య సమితి సభ్యుడు జెల్లపెల్లి అంజన్న మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీ ప్రారంభమైనప్పటి నుంచి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వం యూనివర్సిటీలను విస్మరించిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్న శాతవాహన యూనివర్సిటీకి కనీసం రెగ్యులర్‌ వీసీని నియమించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటుఆన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి విద్యాశాఖకు మంత్రిని నియమించాలన్నారు. శాతవాహన యూనివర్సిటీకి రెగ్యులర్‌ వీసీ నియమించి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని, ఖాళీలను భర్తీ చేయాలని, విద్యార్థులకు మెరుగైన హాస్టల్‌ వసతిని కల్పించాలని కోరారు. యూనివర్సిటీలో ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌లో అనేక రకాల అవకతకలతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌యూ సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విభాగ్‌ కన్వీనర్‌ అజయ్‌, రాష్ట్ర హాస్టల్స్‌ కన్వీనర్‌ రంజిత్‌, జిల్లా కన్వీనర్లు పూసాల విష్ణు, మాడవేణి సునీల్‌, బండి రాజశేఖర్‌, సామలపల్లి ప్రశాంత్‌, నగర కార్యదర్శులు బామండ్ల నందు, రాజు, సిద్ధార్థ, వరుణ్‌, హాస్టల్‌ కన్వీనర్‌ రాసూరి ప్రవీణ్‌, ఉమేష్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధు, శ్రీపతి, సాయితేజ, అజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:55 PM

Advertising
Advertising