ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అందరి చూపు.. శ్రీపాద ఎల్లంపల్లి వైపు..

ABN, Publish Date - Jul 25 , 2024 | 12:38 AM

ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులకు వరప్రదాయిని అయిన ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, మిడ్‌ మానేరులోకి సరిపడా నీరు రాకపోవడంతో అందరిచూపు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుపై పడింది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులకు వరప్రదాయిని అయిన ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, మిడ్‌ మానేరులోకి సరిపడా నీరు రాకపోవడంతో అందరిచూపు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుపై పడింది. ఎల్లంపల్లికి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోక ముందే అక్కడి నుంచి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా మిడ్‌ మానేరుకు నీటిని తరలిస్తే వానాకాలం పంటల సాగు ముందుకు సాగనున్నది. వర్షాకాలం ప్రారంభమై 55 రోజులు గడుస్తున్నా కూడా గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టుల్లోకి వరద నీరు రాలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితి దయనీయంగా ఉంది. పోచంపాడ్‌లో గల శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 25.167 టీసీలకు చేరుకున్నది. 19,500 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. గత ఏడాది ఇదే సమయానికి ఎస్సారెస్పీ నీటి మట్టం 55 టీసీలుగా ఉంది. అప్పటికీ, ఇప్పటికీ 30 టీఎంసీల తేడా ఉంది. సాధారణంగా ప్రాజెక్టులో 50 టీఎంసీలకు నీటి మట్టాలు దాటితేనే ఆయకట్టు భూములకు సాగు నీటిని విడుదల చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరస్వతి, లక్ష్మి, కాకతీయ కాలువల ద్వారా నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లోని 5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. అక్కడి నుంచి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా ఎల్‌ఎండీకి నీటిని సరఫరా చేసి దాని కింద కరీంనగర్‌, వరంగల్‌, హన్మకొండ, తదితర జిల్లాల్లోని 4.5 లక్షల ఎకరాల ఆయకట్టు భూములకు సాగు నీటిని అందించాల్సి ఉంది. అయితే ఎల్‌ఎండీ పరిస్థితి కూడా బాగా లేదు. దాని పూర్తిస్థాయి నీటి మట్టం 24.034 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.280 టీఎంసీల నీరు ఉంది. క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి 945 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎల్‌ఎండీలోకి కనీసం 15 టీఎంసీల నీరు రానిదే ఆయకట్టు భూములకు సాగు నీటిని విడుదల చేయరు. ఎల్‌ఎండీకి ఎగువ భాగాన గల మిడ్‌ మానేరు పూర్తి స్థాయి నీటిమట్టం 27.54 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.89 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే ఎల్‌ఎండికి 18.70 టీఎంసీల నీళ్లు, మిడ్‌ మానేరులోకి 22 టీఎంసీల నీళ్లు చేరుకోవాల్సి ఉంది. మొత్తం 40 టీఎంసీల నీళ్లు అవసరం. గత ఏడాది జూలై నెలాఖరు నుంచి ఆగస్టు నెలలో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పూర్తి స్థాయి నీటి మట్టాలకు చేరుకున్నాయి. గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలి పెట్టారు. కానీ ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

ఫ వరద నీరంతా సముద్రంలోకి..

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు జరగడంతో ఆయా బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో వరద నీరంతా గోదావరి గుండా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదు. గత ఏడాది ఇదే సమయానికి ఎల్లంపల్లిలో 16.538 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. జూలై మొదటి వారంలో వర్షాలు పడకపోవడంతో కాళ్వేరం ప్రాజక్టు నుంచి ఎల్లంపల్లిలోకి 8 నుంచి 9 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. అక్కడినుంచి మిడ్‌ మానేరుకు తరలించారు. వర్షాలు ప్రారంభమైన తర్వాత ఎత్తిపోతలను నిలిపివేశారు. వారం రోజులుగా ఎల్లంపల్లి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి సుమారు 7 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి. బుధవారం సాయంత్రం నాటికి ప్రాజెక్టులోకి 6,525 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 12.864 టీఎంసీలకు చేరుకున్నది. గురువారం నాటికి 13 టీఎంసీలకు చేరుకోనున్నది. కడెం, ఎల్లంపల్లి ఎగువ ప్రాంతంలో మరిన్ని భారీవర్షాలు కురిస్తే మాత్రం వారం రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోనున్నదని నీటి పారుదల శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల పరిస్థితి, ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటిని అంచనా వేసి అదనపు నీటిని గేట్ల ద్వారా గోదావరిలోకి వదిలిపెట్టకుండా మోటార్లు ఆన్‌చేసి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా మిడ్‌ మానేరుకు తరలించాలని రైతులు చెబుతున్నారు. అవసరాన్ని బట్టి మిడ్‌మానేరు నుంచి ముందుగా ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేసి ఆ తర్వాత మల్లన్నసాగర్‌కు తరలించేందేందుకు నీటి పారుదల శాఖాధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఎస్సారెస్పీ డి-83, డి-86 కాలువల ద్వారా జిల్లాలో 1,82,699 ఎకరాల ఆయకట్టు భూములు సాగులోకి రావాల్సి ఉన్నాయి. చాలా మంది రైతులు వరి నార్లు పోసి నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నాట్లు వేసే పరిస్థితి ఉన్నా, ప్రాజెక్టు నిండక నీటిని విడుదల చేయకుంటే నిలువునా మునగాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ఎస్సారెస్పీలోకి కనీసం 45 టీఎంసీల నీళ్లు వచ్చినా వర్షాధారంతో ఆయకట్టు భూముల్లో వరి నాట్లు వేసుకుంటామని రైతులు చెబుతున్నారు. మిడ్‌ మానేరు, ఎల్‌ఎండీలకు క్యాచ్‌మెంట్‌ ఏరియాల నుంచి సరిపడా నీళ్లు రాకుంటే మాత్రం ఎల్లంపల్లి నుంచే వాటికి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. వర్షాలను బట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల నుంచి మిడ్‌ మానేరుకు నీటిని తరలిస్తామని నీటి పారుదల శాఖాధికారులు అంటున్నారు.

Updated Date - Jul 25 , 2024 | 12:39 AM

Advertising
Advertising
<