ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం
ABN, Publish Date - Jul 10 , 2024 | 12:08 AM
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని కరీంనగర్‌లో మంగళవారం ఘనంగా నిర్వమించారు. ఈ సందర్భంగా ఐదు వేల మంది విద్యార్థులతో కోర్టు చౌరస్తా నుంచి ఎస్సారార్ కళాశాల వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు.
గణేశ్‌నగర్, జూలై 9: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని కరీంనగర్‌లో మంగళవారం ఘనంగా నిర్వమించారు. ఈ సందర్భంగా ఐదు వేల మంది విద్యార్థులతో కోర్టు చౌరస్తా నుంచి ఎస్సారార్ కళాశాల వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఏబీవీఈపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్డర్ జానారెడ్డి హాజరై మాట్లాడారు. 75 ఏళ్లుగా ఏబీవీపీ ఎన్నో విద్యారంగ సమస్యలపై పోరాటం చేసిందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన ఏబీవీపీ దేశ నలుమూలలా విస్తరిస్తూ 50 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగిందని తెలిపారు. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తూ ఎన్నో విజయాలు సాధించిందన్నారు. భవిష్యత్తులోనూ ఏబీవీపీ విద్యార్థుల సమస్యల పరిష్కరానికి ఉద్యమిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ కోడి అజయ్, జిల్లా ప్రముఖ్ రాచకొండ గిరిబాబు, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి బామాండ్ల నందు, రాష్ట్ర కార్యాసమితి సభ్యులు అంజన్న, స్టేట్ లాఫోరమ్ కో కన్వీనర్ ప్రమోద్, వంశీ, విష్ణు, ప్రదీప్, విగ్నేష్, విష్ణు, ప్రశాంత్, ఆకాష్ పాల్గొన్నారు..
ఫ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ఏకైక సంస్థ ఏబీవీపీ
- కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్
భగత్‌నగర్: విద్యార్థుల సమస్యలతోపాటు విద్యార్థుల్లో నిర్మాణాత్మకమైన దేశభక్తిని పెంపొందించే ఏకైక సంస్థ ఏబీవీపీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఒక ప్రటనలో అన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏర్పాటై 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల క్రితం ఐదుగురితో ఢిల్లీలో ప్రారంభమై 50 లక్షలకు పైగా సభ్యత్వంతో దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవిర్భవించిందన్నారు. దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యమై అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ కేరళ, తెలంగాణ, బెంగాల్, అసోం సహా అనేక రాష్ట్రాల్లో ఎంతో మంది కార్యకర్తలు హత్యకు గురైనా విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నదన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో ఏబీవీపీ పాత్ర మరువలేనిదన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సత్యగ్రహాలు చేసి జాతిని ఏకం చేసిందన్నారు. వెంకయ్యనాయుడు, సుశీల్‌కుమార్ మోదీ, అరుణ్‌జైట్లీ, జేపీ నడ్డా సహా ఎందరో నాయకులు ఏబీవీపీ నుంచి ఎదిగిన వారేనని తెలిపారు.
Updated Date - Jul 10 , 2024 | 12:08 AM