ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిప్పుల కుంపటి

ABN, Publish Date - Apr 19 , 2024 | 01:29 AM

ఠారెత్తిస్తున్న ఎండలతో జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. తెల్లవారుజామున 7 గంటల నుంచే సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టాడు. రాత్రి 10 గంటల వరకు కూడా ఎండ వేడిమి, వేడి గాలులను తట్టుకోలేక జనం విలవిలలాడారు.

- ఠారెత్తిస్తున్న ఎండలు

- వీణవంకలో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత

- ఇంటా బయట ఒకటే వేడి

-రాత్రి 10 గంటల వరకూ తగ్గని వేడి గాలులు

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 18: ఠారెత్తిస్తున్న ఎండలతో జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. తెల్లవారుజామున 7 గంటల నుంచే సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టాడు. రాత్రి 10 గంటల వరకు కూడా ఎండ వేడిమి, వేడి గాలులను తట్టుకోలేక జనం విలవిలలాడారు. గురువారం జిల్లాలోని వీణవంక మండలంలో రికార్డుస్థాయిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. జిల్లా అంతటా 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. ఎండ వేడిమితో ఇంట్లో ఉండలేక... బయటకు వెళ్లలేక జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇంటా.. బయటా భరించలేని ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జమ్మికుంట మండలంలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా మానకొండూర్‌ మండలం ఈదుగట్టపల్లిలో 43.9, గంగిపెల్లి, పోచంపలి, చిగురుమామిడి మండలం ఇందుర్తిలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొత్తపల్లిలో 43.6 డిగ్రీలు, శంకరపట్నం మండలం కొత్తగట్టులో 43.2, కరీంనగర్‌లో 42.8 డిగ్రీలు, ఇల్లందకుంట మండలం మల్యాలలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండుల విపరీతంగా ఉండడంతో మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రావడం లేదు. దీంతో నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులతోపాటు ముఖ్య కూడళ్లు జనం లేక వెలవెల బోతున్నాయి. జంతువులు, పక్షులు, మూగజీవాలు ఎండ వేడిమిని తట్టుకోలేక విలవిలలాడుతున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలు, వ్యాధిగ్రస్తులు వేడిమిని భరించ లేక నానా యాతనపడుతున్నారు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు కూడా పనిచేయడం లేదని, ఇంట్లో ఉండలేక పోతున్నామని, రాత్రి 10 గంటల వరకుకూడా వేడి గాలులు వీస్తున్నాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితేకానీ డొక్కాడని కూలీలు, ఆటోలు, రిక్షా కార్మికులు, వీధివ్యాపారులు, చిరువ్యాపారులు బతుకుబండిని లాగేదెట్లా అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత గత ఏడాదితో పోల్చితే ఈయేడు 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినందున అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి ఉదయం 10 తర్వాత సాయంత్రం 6 గంటల వరకు రావద్దంటూ డాక్టర్లు సూచిస్తున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 01:29 AM

Advertising
Advertising