Manchiryāla- ఎంపీడీవో కార్యాలయం తనిఖీ
ABN, Publish Date - Aug 13 , 2024 | 10:53 PM
చెన్నూరులోని ఎంపీడీవో కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, హాజరు రిజిష్టర్లను పరిశీలించారు. ప్రజాపాలన సేవా కేంద్రంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు.
చెన్నూరు, ఆగస్టు 13: చెన్నూరులోని ఎంపీడీవో కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, హాజరు రిజిష్టర్లను పరిశీలించారు. ప్రజాపాలన సేవా కేంద్రంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఈజీఎస్ కార్యాల యాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కిష్టంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. నర్సరీని పరిశీలించి మొక్కలను సంరక్షించాలని సూచించారు. గ్రామంలోని బొమ్మవాడలో శానిటేషన్, క్లోరినేషన్ పనులను పరిశీలించి సూచనలు చేశారు. తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో అజ్మత్ ఆలీ, ఏపీవో గంగాభవానీ తదితరులు ఉన్నారు.
Updated Date - Aug 13 , 2024 | 10:53 PM