ప్రాణమున్నంత వరకు ప్రజాసేవలోనే..
ABN, Publish Date - Aug 21 , 2024 | 11:30 PM
తన కంఠంలో ప్రాణమున్నంత వరకు ప్రజా సేవలో ఉంటానని, పేద ప్రజలకు సేవ చేయడంలో తనకు తీరని సంతోష ముందని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు.
- బూట్ల పంపిణీకి యన్మనగండ్ల విద్యార్థులే కారణం
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
నవాబ్‌పేట, ఆగస్టు 21 : తన కంఠంలో ప్రాణమున్నంత వరకు ప్రజా సేవలో ఉంటానని, పేద ప్రజలకు సేవ చేయడంలో తనకు తీరని సంతోష ముందని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కారుకొండ, యన్మనగండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు. పీసీసీ అధికార ప్రతినిది జహీర్ అక్తర్, పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రయ్య, హమీద్ మహేక్, నాయకులు ఆళ్ల భూపాల్‌రెడ్డి, దేపల్లి వెంకటేష్ గౌడ్, నవాజ్ రెడ్డి, నర్సింహాచారి, నీల్యనాయక్, రఘువీర్ శర్మ, మల్లేష్ యాదవ్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను గత ఎన్నికలకంటే ముందు పాదయాత్ర చేసే సమయంలో యన్మనగండ్ల గేటు వద్ద విద్యార్థుల పాదాలకు చెప్పులు లేకపోవడం గమనించి తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బూట్లు ఇవ్వాలని నిర్ణయించు కున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే పలు రహదారులు బీటీలుగా మార్చడంతో పాటు డబుల్ రహదారులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని పాఠశాలలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, గత పాలకుల విధానాల వల్ల నేడు పాఠశాలల్లో ఈ దుస్థుతి ఉందన్నారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు శివకుమార్ ఇంట్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని వధువును మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే అనిరుధురెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రాజునాయక్, హెచ్‌ఎం దశరథ్ నాయక్, నోడల్ అధికారి నాగ్య నాయక్, నాయకులు కొల్లూర్ ఖాజ, బోవొళ్ల రాజశేఖర్, మాజీ సర్పంచ్ భాస్కర్, జమీరొద్దీన్, రియజ్, తిర్మలయ్య, శ్రీనివాస్ గౌడ్, పుల్యనాయక్, బాలయ్య, గోపీచంద్, శ్రీనివాస్, రాధాకృష్ణ, శ్రీను, నర్సింహులు పాల్గొన్నారు.
Updated Date - Aug 21 , 2024 | 11:30 PM