ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TSPSC Group 1 Notification: గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల..

ABN, Publish Date - Feb 19 , 2024 | 07:45 PM

TSPSC Group 1 Notification: తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) గుడ్ న్యూస్ చెప్పింది. 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్(Group 1 Notification) విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. ఈ పోస్టులకు దరఖాస్తులు(Group 1 Applications) ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

TSPSC Group 1 Notification

TSPSC Group 1 Notification: తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) గుడ్ న్యూస్ చెప్పింది. 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్(Group 1 Notification) విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. ఈ పోస్టులకు దరఖాస్తులు(Group 1 Applications) ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. చివరి తేదీ మార్చి 14వ తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌(https://www.tspsc.gov.in/)ను సందర్శించడం ద్వారా గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో 503 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా.. ఒకసారి పేపర్ లీక్ అవడం కారణంగా, మరొకసారి నిర్వహణ లోపం కారణంగా రద్దు అయ్యాయి. రెండోసారి నిర్వహించిన పరీక్ష ఫలితాలను వెల్లడించేలా అనుమతివ్వాలని సుప్రీంకోర్టును గత ప్రభుత్వం కోరింది. అయితే, ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోగా.. సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. దాంతో టీఎస్‌పీఎస్‌సీ 503 పోస్టులకు మరో 60 పోస్టులను కలిపి కొత్తగా 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది.

వయో పరిమితి పెంపు..

గ్రూప్1 నోటిఫికేషన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది టీఎస్‌పీఎస్‌సీ.. వరుసగా రెండుసార్లు పరీక్ష రద్దు కావడం, రెండేళ్లు ముగియడంతో.. వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. దీంతో 46 ఏళ్ల వరకు అభ్యర్థులు ఈ గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2024 | 07:45 PM

Advertising
Advertising