ABN Andhra Jyothy: తప్పు మీద తప్పు.. మళ్లీ దొరికారు.. 'సాక్షి' నీ విలువలెక్కడ
ABN, Publish Date - Oct 07 , 2024 | 10:16 PM
దొంగే దొంగ అన్నట్టు ఉంది సాక్షి మీడియా పరిస్థితి. ఏబీఎన్ ట్యాగ్ మిస్ యూజ్ చేశారని అంటే.. ఏబీఎన్ తప్పు చేసిందని కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. ఆంధ్రజ్యోతి/ట్యాగ్/ఈనాడు చేర్చి తప్పులో కాలేసింది. సాక్షి మీడియా తీరును చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి ట్యాగ్ ఉపయోగించి అడ్డంగా దొరికిపోయింది ఓ రోత పత్రిక. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ తప్పును అలా ఉంచి.. ఆంధ్రజ్యోతిపై విషం కక్కింది. సాక్షి టీవీలో యాంకర్ స్క్రీన్ మీద ఆంధ్రజ్యోతి/ట్యాగ్/ ఓ పత్రిక అని రాసి ఓపెన్ చేశారు. అలా అయితే ఆంధ్రజ్యోతి కింద ఈనాడు కనిపిస్తోంది. జీరో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న కొందరు ఇలా అబద్దాన్ని నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లేని ఓ పత్రిక పేరు ఎందుకు..? అసలు ఆ పత్రిక పేరు సెర్చ్ చేయాల్సిన అవసరం ఏముంది. దొంగే దొంగ అన్నట్టు ఓ రోత పత్రిక తీరు ఉంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. సాక్షి అడ్డగోలు రాతలను వీక్షకులు గమనిస్తూనే ఉన్నారు.
మోసం.. వంచన
తప్పు చేసి బుకాయించే వాడిని ఏమంటారు. మోసగాడనే కదా. ఇప్పుడు రోత పత్రిక పరిస్థితి అచ్చం అలాగే తయారైంది. ఆ సంస్థ వెబ్‌సైట్‌లో అక్రమంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్స్ ఉపయోగించడమే కాకుండా.. దాన్ని సమర్థించుకుంటూ మరో చెత్త డిబెట్‌తో వచ్చింది. ఓ టీవీలో 'ఏబీఎన్ విష ప్రచారం'పేరుతో డిబెట్ జరిపింది. ఇందులో న్యూస్ ప్రజెంటర్ మాట్లాడుతూ.. ఏబీఎన్‌పై, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణపైన అడ్డగోలు ఆరోపణలు చేశారు. 'ఈనాడు' వెబ్‌సైట్ ట్రాఫిక్‌ను ఏబీఎన్ వైపు మళ్లించాలని కుట్ర పన్నుతున్నారని పసలేని, పనికిమాలిన వాదనలు చేశాడు. దానికితోడు సాక్షికి ఏదో ప్రజాదరణ ఉన్నట్లు కట్టుకథలు అల్లాడు. చివరికి ఆరోపణలు రుజువు చేయాలనుకుని అడ్డంగా దొరికిపోయాడు. డిబెట్‌లో న్యూస్ ప్రజెంటర్ గూగుల్ సర్చ్‌కు సంబంధించి ఓ ప్రింట్‌ను చూపిస్తూ.. ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్ అని గూగుల్‌లో కొడితే ఈనాడు వార్తలు వస్తున్నాయని అన్నాడు. ఈ క్రమంలో తాము చేసిన మరో తప్పును గుర్తించలేకపోయింది.
ఇతర సైట్ల పేరుతో..
ఏ వెబ్‌సైట్ అయిన దాని పేరుతోనే యూజర్లు గూగుల్ సర్చ్ చేస్తారు. కానీ దాంట్లో ఇతర సైట్ పేరును జోడించి గూగుల్‌లో వెతకరు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సైట్‌ని చూడాలనుకునే వారు.. andhrajyothy.com అని గూగుల్ చేస్తారు. andhrajyothy/tags/eenadu అని ఎందుకు వెతుకుతారు. ఇంతటి చిన్న లాజిక్‌ను మిస్ అయి రోత పత్రిక తన పరువు తానే తీసుకుంది. పైగా గూగుల్ అనాలిటిక్స్ గురించి ఏబీఎన్‌కు తెలుసా అంటూ రోతను ప్రసారం చేసింది. తప్పుల మీద తప్పులు చేస్తూ కప్పి పుచ్చుకునేందుకు చూసి తిరిగి బూమరంగ్ కావడంతో కవర్ చేసుకోవడానికి ముప్పు తిప్పలు పడుతోంది. తమ అధినేతను జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించి పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారుతుందని అనుకోలేదు. సాక్షి మీడియాలో విలువలు దిగజారుతుండటంపై ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.
మరిన్ని ఏపీ, తెలంగాణ వార్తల కోసం
Updated Date - Oct 07 , 2024 | 10:29 PM