ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: ‘చేతకాకపోతే దిగిపో.. నేను సీఎంగా ఎక్కి సెట్ చేస్తా’.. హరీష్ రావు సంచలన కామెంట్స్..

ABN, Publish Date - Feb 14 , 2024 | 06:35 PM

Harish Rao vs Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. ‘మేడిగడ్డను రిపేర్ చేయలేమంటున్న రేవంత్ రెడ్డీ.. నీకు చేతకాకపోతే దిగిపో.. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డను పునరుద్ధరించి చూపిస్తా. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసే బాధ్యత నేను తీసుకుంటా.’ అంటూ..

Harish Rao Sensational Comments

Harish Rao vs Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. ‘మేడిగడ్డను రిపేర్ చేయలేమంటున్న రేవంత్ రెడ్డీ.. నీకు చేతకాకపోతే దిగిపో.. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డను పునరుద్ధరించి చూపిస్తా. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసే బాధ్యత నేను తీసుకుంటా.’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

బుధవారం నాడు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన హరీష్ రావు.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డను బూతద్దంలో పెట్టీ చూపుతున్నారని విమర్శించారు. బ్యారేజీ పునరుద్ధరణపై దృష్టిపెట్టడం లేదని విమర్శించారు. కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకు పోయిందని నాటి పరిస్థితులను గుర్తు చేశారు. సింగూరు డ్యాం, ఎల్లంపల్లి, సత్నాల, పులిచింతల, పుట్టంగండి గేట్లు కూడా కొట్టుకుపోయాయని, కాంగ్రెస్ హయాంలో పంజాగుట్ట ప్రాజెక్ట్ నిర్మాణంలో వుండగానే కూలిందన్నారు. కానీ, కావాలని కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తరువాత రెండు పంటలకు నీళ్లు వచ్చాయో లేదో రైతులను అడగాలని సవాల్ విసిరారు హరీష్ రావు. కాళేశ్వరం ద్వారా 20 లక్షల ఎకరాలకు ప్రయోజనం జరిగిందన్నారు. ఈ వాస్తవాలను దాచి కాంగ్రెస్ ప్రభుత్వం తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తిలో కేవలం 13వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని లెక్కలతో సహా వివరించారు హరీష్ రావు. కానీ, తాము వచ్చాక కల్వకుర్తిలో 3.07 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామన్నారు.

విచారణ జరిపి చర్యలు తీసుకోండి..

మేడిగడ్డ ప్రాజెక్టుపై విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కానీ, పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలన్నారు. రైతులకు నష్టం జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆలస్యం చేస్తే ప్రజలకు తాగు, సాగునీటి ఇబ్బంది వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బురద రాజకీయాలు చేస్తోందని, తమపై బురద జల్లుతోందన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే అన్నట్లు ప్రచారం చేస్తున్నారని, అది ఏమాత్రం కరెక్ట్ కాదని హరీష్ రావు వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మల్లన్న సాగర్, కొండపోచమ్మను చూపించాలన్నారు. ప్రతిపక్ష పార్టీపై బురదజల్లడం మాని.. పాలనపై దృష్టి పెట్టాలని హితవు చెప్పారు.

Updated Date - Feb 14 , 2024 | 07:12 PM

Advertising
Advertising