PM Modi: రంగంలోకి ప్రధాని మోదీ.. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నేతల ప్లాన్ ఇదే!
ABN, Publish Date - Mar 12 , 2024 | 09:02 PM
రాబోయే పార్లమెంట్ ఎన్నికల(Parliment Elections) పై బీజేపీ (BJP) దృష్టి సారించింది. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. ప్లాన్‌లో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) చరిష్మాను లోక్‌సభ ఎన్నికల్లో వాడుకోవాలని బీజేపీ రాష్ట్ర నేతలు భావించారు.
హైదరాబాద్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల(Parliment Elections) పై బీజేపీ (BJP) దృష్టి సారించింది. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. ప్లాన్‌లో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) చరిష్మాను లోక్‌సభ ఎన్నికల్లో వాడుకోవాలని బీజేపీ రాష్ట్ర నేతలు భావించారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీని తెలంగాణలో పర్యటించేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. పది రోజుల వ్యవధిలోనే రెండోసారి రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొననున్నారు.
15,16,18వ తేదీల్లో మూడు రోజుల పాటు మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. 15వ తేదీన మల్కాజ్‌గిరిలో.. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలు కలిపి మోదీతో భారీ బహిరంగ సభలకు రాష్ట్ర నేతలు ప్లాన్ చేశారు. 16వ తేదీన జగిత్యాలలో.. నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ స్థానాలు కలిపి బహిరంగ సభ నిర్వహించనున్నారు. 18వ తేదీన నాగర్‌కర్నూల్‌లో.. మహబూబ్‌నగర్, నల్లగొండ, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాలు కలిపి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు సభల్లో 9 పార్లమెంట్ స్థానాలు కవర్ చేసేలా ప్రధాని మోదీ సభలు ఉండనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 12 , 2024 | 09:27 PM