ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Balmoor Venkat: వెరైటీగా ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి ఎమ్మెల్సీ బల్మూరి

ABN, First Publish Date - 2024-02-08T10:39:24+05:30

Telangana: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. అయితే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాత్రం వెరైటీకి అసెంబ్లీకి వచ్చారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) ప్రారంభంకానున్నాయి. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. అయితే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmoor Venkat) మాత్రం వెరైటీకి అసెంబ్లీకి వచ్చారు. మొదటి రోజు అసెంబ్లీకి ఆర్టీసీ బస్‌లో (TSRTC Bus) ఎమ్మెల్సీ అసెంబ్లీకి వచ్చారు. గురువారం ఉదయం నాంపల్లిలో బస్‌ ఎక్కి అసెంబ్లీకి చేరుకున్నారు. బస్సు ప్రయాణంలో ఉచిత బస్‌కు సంబంధించి మహిళలతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడి.. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.


మరికాసేపట్లో...

కాగా... ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఉభయసభలు సమావేశంకానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంపై పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గత పదేళ్ల పాలన తీరు, రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిపై గవర్నర్ ప్రసంగించనున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ స్పీచ్‌లో గత బీఆర్ఎస్ (BRS) పాలనపై ఘాటైన విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నేడు అసెంబ్లీలో అదే స్థాయిలో గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలు (Loksabha) సమీపిస్తున్న సందర్భంలో అసెంబ్లీ సమావేశాలు పొలిటికల్ హీట్‌ను పెంచనున్నాయి. మరోవైపు తెలంగాణ వచ్చాక, పదేళ్ల తర్వాత ప్రతిపక్ష నాయకుడి హోదాలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (BRS Chief KCR) అసెంబ్లీకి రానున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - 2024-02-08T16:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising