ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mahalakshmi Scheme: రూ. 500 గ్యాస్ కావాలంటే ఇవి ఉండాల్సిందే.. గైడ్‌లైన్స్ విడుదల చేసిన సర్కార్..

ABN, Publish Date - Feb 27 , 2024 | 12:41 PM

Rs 500 Gas Cylinder Scheme: మహాలక్ష్మి పథకంలో(Mahalakshmi Scheme) భాగంగా మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్(Telangana Government). రూ. 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ క్రమంలో రూ. 500 గ్యాస్ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేశారు.

Mahalakshmi Scheme 2024, Mahalakshmi Scheme, Telangana Government, CM Revanth Reddy, Guidlines, Rs 500 Gas Cylinder Scheme, CM Revanth Reddy, Gas Subsidy

హైదరాబాద్, ఫిబ్రవరి 27: మహాలక్ష్మి పథకంలో(Mahalakshmi Scheme) భాగంగా మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్(Telangana Government). రూ. 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ క్రమంలో రూ. 500 గ్యాస్ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేశారు. ఈ నిబంధనల ప్రకారం.. పథకం అమలు ఎలా చేస్తారు? ఎవరు ఈ పథకానికి అర్హులు? వంటి కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

👉 మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీమ్‌కి సంబంధించిన జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

👉 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు క్రైటీరియాలను ప్రకటించింది ప్రభుత్వం.

👉 సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారులను గుర్తించారు.

👉 ఈ పథకానికి అర్హులుగా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

👉 మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని.. దాని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్స్ కేటాయిస్తారు.

👉 వినియోగదారులు తొలుత మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి.

👉 ఆ తరువాత వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ జమ చేస్తారు.

👉 గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా OMC సంస్థలకు ఇవ్వనుంది. సంస్థల నుంచి DBT ద్వారా వినియోగదారులకు నగదు చెల్లింపు చేస్తారు.

👉 జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని మానిటరింగ్ చేయనుంది ప్రభుత్వం.

👉 భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం రూ. 500 చెల్లించేలా ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.

👉 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్‌లోకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 27 , 2024 | 12:43 PM

Advertising
Advertising