ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ..

ABN, First Publish Date - 2024-02-06T10:39:47+05:30

న్యూఢిల్లీ: ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో వెంకటేష్ కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో వెంకటేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతకుముందు ఢిల్లీలో రేవంత్ రెడ్డితో కలిసి కారులో కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లారు. అక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, హస్తం పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. అందరి సమక్షంలో ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు వేణుగోపాల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరికొంతమంది వెంకటేష్ అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఈ తరుణంలో వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రస్తుతం వెంకటేష్ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ఆయనతోపాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డితోపాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. మెజార్టీ లోక్‌సభ స్థానాలు గెలుచుకోవాలన్న టార్గెట్‌తో.. బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీ వెంకటేష్‌ను మారుస్తారన్న చర్చ పార్టీలో మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పోటీలో నిలవబోతున్నారన్నది బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించిన తర్వాత పార్టీ నాయకత్వానికి వెంకటేష్‌కు కొంత గ్యాప్ ఏర్పడినట్టుగా సమాచారం. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ స్థానంలో మరొకరిని బరిలోకి దింపే ఆలోచన అధిష్టానం చేస్తున్న తరుణంలో వెంకటేష్ కాంగ్రెస్‌లో చేరారు.

Updated Date - 2024-02-06T11:15:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising