ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS NEWS: బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ABN, Publish Date - Feb 14 , 2024 | 02:56 PM

బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఏలేటీ మహేశ్వరరెడ్డిని ఆ పార్టీ హై కమాండ్ బుధవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఫ్లోర్ లీడర్‌తో పాటు మిగతా సభ్యులను కూడా అధిష్ఠానం నియమించింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పాయల్ శంకర్, చీఫ్ విప్‌గా పాల్వాయి హరీష్ బాబు, విప్‌గా ధన్ పాల్ సూర్యనారాయణ, ట్రెజరర్‌గా పైడి రాకేష్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీగా రామారావు పాటిల్‌ను బీజేపీ హై కమాండ్ నియమించింది.

హైదరాబాద్: బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఏలేటీ మహేశ్వరరెడ్డిని ఆ పార్టీ హై కమాండ్ బుధవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఫ్లోర్ లీడర్‌తో పాటు మిగతా సభ్యులను కూడా అధిష్ఠానం నియమించింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పాయల్ శంకర్, చీఫ్ విప్‌గా పాల్వాయి హరీష్ బాబు, విప్‌గా ధన్ పాల్ సూర్యనారాయణ, ట్రెజరర్‌గా పైడి రాకేష్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీగా రామారావు పాటిల్‌ను బీజేపీ హై కమాండ్ నియమించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ 8 సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే.

కాగా.. ఏలేటి మహేశ్వర రెడ్డి నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే అసెంబ్లీ బీఏసీ సమావేశానికి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరిని పిలవాలని ఆ పార్టీ శాసనసభ్యులు స్పీకర్‌ను కోరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని పిలవాలని బీజేపీ ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసిన లేఖను స్పీకర్‌కు అందించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వరరెడ్డి బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. దీనిని బట్టి బీజేపీ శాసనసభా పక్షనేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి పేరును బీజేపీ హై కమాండ్ ఖరారు చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 14 , 2024 | 04:08 PM

Advertising
Advertising