ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bank: జనవరి 1 నుంచి తెలంగాణలో ఆ బ్యాంకులు కనబడవు

ABN, Publish Date - Dec 26 , 2024 | 04:53 PM

Telangana: తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఏపీజీవీబీ బ్యాంకు సేవల్లో నాలుగు రోజుల పాటు అంతరాయం కలుగనుంది. ఆన్‌లైన్ సేవలు, యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితర సేవలకు 28 నుండి 31 వరకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ వై.శోభ వెల్లడించారు.

Telangana Grameena Bank

హైదరాబాద్, డిసెంబర్ 26: రాష్ట్రంలోని ఏపీజీవీబీ 493 శాఖలు జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకు (Telangana Grameena bank) లో విలీనంకానున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ వై.శోభ (Telangana Grameena Bank Chairman Y. Shobha) ప్రకటించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం (Central govt) నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణలోని ఏపీజీవీబీ శాఖలోని ఉద్యోగులు కూడా ఆయా శాఖల్లోనే పనిచేస్తారని తెలిపారు. ఏపీజీవీబీ, టీజీబీ విలీనంతో 928 శాఖలు రూ.70 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందన్నారు. విలీనం వల్ల బ్యాంకు శాఖల కార్యకలాపాలు ఆన్‌లైన్ సేవలు, యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితర సేవలకు 28 నుండి 31 వరకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపారు. ఈ నెల 30, 31 తేదీల్లో అత్యవసర పరిస్థితుల్లో ఖాతాదారులు శాఖల నుంచి 5000 వరకు నగదు విత్ డ్రా అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. అయితే జనవరి ఒకటి నుంచి బ్యాంకు సేవలు యధాతథంగా ఉండనున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ వై.శోభ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

నేడు కర్ణాటకకు రేవంత్.. విషయం ఇదే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 26 , 2024 | 05:03 PM