Hyderabad: నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచన
ABN, Publish Date - Mar 12 , 2024 | 08:48 AM
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మంగళవారం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సంబంధిత విభాగ అధికారులు వెల్లడించా రు.
హైదరాబాద్ సిటీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మంగళవారం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సంబంధిత విభాగ అధికారులు వెల్లడించా రు. అమిత్‌షా రోడ్డు మార్గంలో వెళ్లి చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం సికింద్రాబాద్, ఎల్బీస్టేడియం, బేగంపేట(Secunderabad, LB Stadium, Begumpet)తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అధికారులు తెలిపారు. ఆయా మార్గాల్లో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
Updated Date - Mar 12 , 2024 | 08:48 AM