NRI News: అమెరికాలో హైదరాబాద్ విద్యార్ధిపై దుండగుల దాడి
ABN, First Publish Date - 2024-02-07T10:54:43+05:30
అమెరికాలో హైదరాబాద్ విద్యార్ధిపై దుండగుల దాడికి పాల్పడ్డారు. సయ్యద్ మజాహిర్ ఆలీ అనే హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి చికాగోలోని ఇండియన్ వెస్లీయన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు.
చికాగో: అమెరికాలో హైదరాబాద్ విద్యార్ధిపై దుండగుల దాడికి పాల్పడ్డారు. సయ్యద్ మజాహిర్ ఆలీ అనే హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి చికాగోలోని ఇండియన్ వెస్లీయన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. విద్యార్థిపై నలుగురు దుండగులు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. తల, ముక్కు, నోటిపై సయ్యద్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
దుండగుల దాడిలో తీవ్ర గాయాలైన సయ్యద్ మజాహిర్ ఆలీ.. తనని కాపాడాలంటూ ఇండియన్ ఎంబసీ అధికారులకి ఫోన్ చేశాడు. హైదరాబాద్‌లో విద్యార్థి తల్లిదండ్రులు సైతం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ దృష్టికి కుటుంబం తీసికెళ్లింది. తమ కుమారుడిని కాపాడాలంటూ సయ్యద్ మజాహిర్ ఆలీ కుటుంబ సభ్యులు కేంద్రమంత్రికి లేఖ రాశారు. అమెరికాలో ఇటీవల దుండగులు రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు.
Updated Date - 2024-02-07T10:56:54+05:30 IST