గద్దర్ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:48 PM
ప్రజాయుద్ధనౌక గద్దర్ పాట ఉన్నంత కాలం చిరస్మరణీయుడని తెలంగాణ స్టూడెంట్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ అన్నారు.
సూర్యాపేటటౌన్, ఆగస్టు 24: ప్రజాయుద్ధనౌక గద్దర్ పాట ఉన్నంత కాలం చిరస్మరణీయుడని తెలంగాణ స్టూడెంట్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ అన్నారు. ఈ నెల 28వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న గద్దర్ ప్రథమ వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన గాన సంస్మరణ సభ పోస్టర్‌లను జిల్లాకేంద్రంలోని 60 ఫీట్ రోడ్డులో శనివారం ఆవిష్కరించారు. ప్రజల తరుఫున విప్లవ ఉద్యమంలో తన పాట, ఆటతో ప్రజల్లో చైతన్యం తీసుకువ చ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర వెలకట్టలేని దన్నా రు. కార్యక్రమంలో నాయకులు మహేష్‌చారి, వర్రె ఆంజనేయులు, త్రిష, అర్చన, స్నేహ, అఖిల, మల్లీశ్వరీ, గణేష్, గాయత్రి, గోపి, మోహన్, అభినవ్, చైతన్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
పీడిత ప్రజల గొంతుక గద్దర్
పీడిత ప్రజల గొంతుక గద్దర్ అని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధుఅన్నారు. జిల్లాకేంద్రంలోని సంఘ కార్యాల యంలో జరిగి సమావేశంలో మాట్లాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో దోపిడీపై గళమెత్తారాన్నారు. అక్రమ కేసులను ఎదురొకని ప్రజలను చైతన్యం చేస్తూ ఉద్యమాలు నిర్మించారన్నారు. కార్యక్రమంలో నాయకులు రహమ్మత్ పాషా, సంతోష్‌రెడ్డి, పోరెళ్ళ విప్లవ్‌కుమార్, ఉపేందర్, బాషపంగు సునీల్, సురేష్, సందీప్, వెంకటేష్, నగేష్ పాల్గొన్నారు.
Updated Date - Aug 24 , 2024 | 11:48 PM