ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS News: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కొనసాగుతున్న వరద..

ABN, Publish Date - Jul 26 , 2024 | 09:18 AM

వర్షాలు కాస్త తగ్గినప్పటికీ రాష్ట్రంలోని నదులు, ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. నదిలో ప్రస్తుత నీటిమట్టం 46.90 అడుగులుగా ఉంది.

నిజామాబాద్: వర్షాలు కాస్త తగ్గినప్పటికీ రాష్ట్రంలోని నదులు, ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. నదిలో ప్రస్తుత నీటిమట్టం 46.90 అడుగులుగా ఉంది. 10,93,322 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

కాగా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి క్రమంగా పెరిగింది. గురువారం సాయంత్రం 6 గంటలకు 48.60 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత మళ్లీ వరద తగ్గింది.


శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌లోకి స్వల్పంగా వరద వస్తోంది. ఇన్ ఫ్లో 19,315 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1072 అడుగులు, 27.578 టీఎంసీలుగా నీటి మట్టం ఉంది.


ఇక నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద జోరు కొనసాగుతోంది. 960 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1388.54 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.494 టీఎంసీలుగా ఉంది.


మరోవైపు రాష్ట్రంలోని ప్రాణహిత నది ఉగ్ర రూపం దాల్చింది. బ్యాక్ వాటర్ పోటెత్తడం తో సుంపుటం, జాజుల పేట, ముక్కిడి గూడెం, కళ్ళంపల్లి, రాచర్ల గ్రామాలు జలధిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగిపోయాయి.


ప్రాజెక్టులకు జల కళ..

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. తుంగ, భద్ర నదులపై ఉన్న కర్ణాటక-ఏపీ-తెలంగాణల ఉమ్మడి జలాశయం తుంగభద్ర ప్రాజెక్టుకు గురువారం వరద మళ్లీ పెరిగింది. తుంగభద్ర డ్యాం గరిష్ఠ నీటిమట్టం 1,633 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. గురువారం ఉదయం 8 గంటలకు నీటి మట్టం 1631.91 అడుగులకు, నీటి నిల్వ 101.91 టీఎంసీలకు చేరింది. ఇక ఆల్మట్టి, నారాయణపూర్‌, తుంగభద్ర జలాశయాలు నిండడంతో వచ్చిన నీరంతటినీ శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. గురువారం ఆల్మట్టికి 2,04,167 క్యూసెక్కులు వస్తుండగా 2,75,000 క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 2.70 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 25 గేట్లు ఎత్తి 2,70,120 క్యూసెక్కులను వదులుతున్నారు.

నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 2.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఔట్‌ఫ్లో 2.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల జలాశయానికి 2.27 లక్షల క్యూసెక్కుల నీరువస్తుండగా 46 గేట్లు ఎత్తి 2,25,354 క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 19,516 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 09:26 AM

Advertising
Advertising
<