ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చిలుకూరు ఆలయం మూసివేతపై తప్పుడు ప్రకటన

ABN, Publish Date - Jun 07 , 2024 | 11:37 PM

సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌లో చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించి శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు ఓ పోస్టు(ప్రకటన) పెట్టారు. అందులో ఇకనుంచి శని, ఆదివారాల్లో ఆలయాన్ని మూసివేస్తున్నారని, మిగతా రోజుల్లో ఆలయం తెరుచుకుని ఉంటుందని, దర్శన వేళల సమయాలను కూడా ప్రకటనలో పేర్కొనడం భక్తులను అయోమయానికి గురిచేసింది.

చిలుకూరు ఆలయం దర్శన వేళల గురించి గూగుల్‌లో చేసిన పోస్టు

శని, ఆదివారాల్లో దర్శనం ఉండదని గూగుల్‌లో పోస్టు

గుర్తుతెలియని దుండగుల నిర్వాకం.. ఆలయ నిర్వాహకుల ఆగ్రహం

తోసిపుచ్చిన ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌

మొయినాబాద్‌ రూరల్‌, జూన్‌ 7: సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌లో చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించి శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు ఓ పోస్టు(ప్రకటన) పెట్టారు. అందులో ఇకనుంచి శని, ఆదివారాల్లో ఆలయాన్ని మూసివేస్తున్నారని, మిగతా రోజుల్లో ఆలయం తెరుచుకుని ఉంటుందని, దర్శన వేళల సమయాలను కూడా ప్రకటనలో పేర్కొనడం భక్తులను అయోమయానికి గురిచేసింది. దాంతో కొందరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ దృష్టికి విషయం తీసుకురాగా.. ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ చిలుకూరు బాలాజీ ఆలయ దర్శన వేళలు, ఆలయం మూసివేత, తెరిచి ఉండడంపై వివరాలు తాము వెల్లడిస్తామని, గూగుల్‌ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తాము ఎలాంటి ప్రకటనలు చేయకుండా సోషల్‌ మీడియాలో వివరాలు పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శని, ఆదివారాల్లో చిలుకూరుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుంటారని, ఆలయం ప్రతిష్ఠతను కొందరు దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. కలియువ దైవం చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రతిష్ఠతను కొందరు దుర్మార్గులు దెబ్బతీయాలని చూస్తున్నారని, అలాంటి వారికి వేంకటేశ్వరస్వామి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రంగరాజన్‌ మండిపడ్డారు. గూగుల్‌లో పెట్టిన వివరాలు అబద్దమని, ప్రజలు నమ్మవద్దని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు, అర్చకుడు రంగరాజన్‌ చెప్పారు.

Updated Date - Jun 07 , 2024 | 11:37 PM

Advertising
Advertising