ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల సామర్థ్యాలను పెంచాలి

ABN, Publish Date - Sep 10 , 2024 | 12:00 AM

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావిధానాలు మార్చాలని, విద్యార్థుల సామర్థ్యాలను పెంచాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌. మధుసూదన అన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ట్రస్మా రాష్ట్ర కమిటీ సభ్యులు

విద్యార్థుల సామర్థ్యాలను పెంచాలి

ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన

మిర్యాలగూడ టౌన, సెప్టెంబరు 9: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావిధానాలు మార్చాలని, విద్యార్థుల సామర్థ్యాలను పెంచాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌. మధుసూదన అన్నారు. పట్టణంలోని ఆదిత్య ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. విస్తరిస్తున్న ఇంటర్నెట్‌ విప్లవంతో ప్రపంచవ్యాప్తంగా మానవ రహిత సేవ లు అందుబాటులోకి వస్తున్నాయని, మర మనుషుల వినియో గం అంతకంతకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ తరుణంలో ప్రైవేట్‌ పాఠశాలలు మరింత కష్టపడాల్సి ఉందని, మానవ వనరుల సంపద తయారు చేయడంలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఏఐ, చాట్‌ జీపీటీల సేవలు ఎప్పటికప్పు డు అందిపుచ్చుకుంటూ నేటి విద్యార్థులను రేపటి పవర్‌ఫుల్‌ పౌ రులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇక సమస్యల పరిష్కారానికి ఐక్యత అవసరమని, సభ్యులందరూ ఏకమవ్వాలని ఆయన ససూచించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమే్‌షరావు, కోశాధికారి రాఘవేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం. రామ్మోహన, గాదె రవీందర్‌రెడ్డి, జిల్లా కోశాధికారి రాములు, మారుతి అమరేందర్‌రెడ్డి, శ్రీరామకవచం నాగరాజు, కుందూరు శ్యాంసుందర్‌రెడ్డి, వంగాల నిరంజనరెడ్డి, కేకే. జయరాజన, రాధాకృష్ణ, శ్రీనివాస్‌, రవికుమార్‌, శ్యాం, అహ్మధ్‌, వినయ్‌కుమార్‌, గోపాల్‌రెడ్డి, సాయిశ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 12:00 AM

Advertising
Advertising