ఈద్ ముబారక్
ABN, Publish Date - Apr 11 , 2024 | 11:24 PM
నెల రోజుల ఉపవాసాల అనంత రం గురువారం ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
- భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్
- కిటకిటలాడిన ఈద్గా మైదానాలు
- పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు
మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 11 : నెల రోజుల ఉపవాసాల అనంత రం గురువారం ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. బుధవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో రోజా (ఉపవాసం) విరమించారు. ఉదయమే జిల్లా వ్యాప్తంగా నమాజు చేశారు. మసీదులు, ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా పలు చోట్ల హిందు, ముస్లింలు సోదభావంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు చెప్పకున్నారు. జిల్లా కేంద్రంలోని రహెమానియా ఈద్గాలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి డీకే అరుణ, మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి, నాయకులు ఎన్పీ వెంకటే శ్, మిథున్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ భారత దేశంలో కుల, మతాలకు అతీతంగా హిందు, ముస్లింలు కలిసి పండుగలు జరుపుకుంటారన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ కలిసిమెలిసి ఉండి సోదరభావాన్ని చాటాలన్నారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హిందు, ముస్లిం లందరూ గంగా, జమున తెహజీబ్‌లా జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశా రు. బీజేపీ మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ పండగలు ఐక్యతకు ప్రతీకలు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ లోక్‌సభ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ భారత దేశం హిం దు, ముస్లింల ఐక్యతకు ప్రతీక అని అన్నారు. మసీదులు, ఈద్గాల్లో జనం పోటెత్తడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జిల్లా వ్యాప్తంగా నియోజ కవర్గాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో రంజాన్ పండుగ జరుపుకు న్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వా ల్, మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్‌ఇసాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, మాజీ మునిసిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మాజీ వైస్ చైర్మన్ తాటి గణే ష్, నాయకులు జీవన్‌రెడ్డి, ఎన్‌పీ వెంకటేష్, మిథున్‌రెడ్డి, వినోద్, రవికిషన్ రెడ్డి, బెనహర్, లక్ష్మణ్‌యాదవ్, రాజేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Apr 11 , 2024 | 11:24 PM