డీఎస్సీ వాయిదా వేయాలి
ABN, Publish Date - Jul 07 , 2024 | 11:17 PM
వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నందున డీఎస్సీ పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామని, తమకు న్యాయం చేసేందుకు డీఎస్సీ పరీక్షను కొద్ది రోజలు వాయిదా వేయాలని మహబూబ్‌నగర్ సెంట్రల్ లైబ్రరీ డీఎస్సీ నిరుద్యోగుల అభ్యర్థుల సంఘం నాయకులు కోరారు.
- మహబూబ్‌నగర్ సెంట్రల్ లైబ్రరీ డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థుల సంఘం నాయకుల డిమాండ్
- జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనరసింహకు వినతి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, జూలై 7 : వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నందున డీఎస్సీ పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామని, తమకు న్యాయం చేసేందుకు డీఎస్సీ పరీక్షను కొద్ది రోజలు వాయిదా వేయాలని మహబూబ్‌నగర్ సెంట్రల్ లైబ్రరీ డీఎస్సీ నిరుద్యోగుల అభ్యర్థుల సంఘం నాయకులు కోరారు. జిల్లా పర్యటనకు వచ్చిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనరసింహను జిల్లా కేంద్రంలో కలిసి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు డీఎస్సీకి సిద్ధమయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు అభ్యర్థులు కోరారు. మంత్రిని కలిసిన వారిలో సాయిరాం, అనూష, తదితరులు ఉన్నారు. అంతకు ముందు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేశారు.
కోయిలకొండ ఆసుపత్రి సమస్యలపై మంత్రికి వినతి
కోయిలకొండ : మండల కేంద్రమైన కోయిలకొండ ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో ప్రధాన సమస్యలు పరిష్కరించాలని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కోరారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహకు వినతిపత్రం అందించారు. ఆదివారం జిల్లాలో మంత్రిని కలిసి ఆసుపత్రి సమస్యల గురించి ఎమ్మెల్యే వివరించారు. ఆసుపత్రి భవనం ఉన్నా అందులో సిబ్బందితో పాటు వసతులు లేవని తెలిపారు. ఆసుపత్రికి అవసరం ఉన్న సిబ్బందితో పాటు, వైద్య పరికరాలు, వసతుల కల్పనకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే వినతికి మంత్రి స్పందించి వసతులు, సిబ్బంది కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.
Updated Date - Jul 07 , 2024 | 11:17 PM