ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manchiryāla- రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

ABN, Publish Date - Jul 31 , 2024 | 10:23 PM

ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకంలో భాగంగా రైతులకు ఎలాం టి ఇబ్బందులు కలుగకుండా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు.

రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

హాజీపూర్‌, జూలై 31: ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకంలో భాగంగా రైతులకు ఎలాం టి ఇబ్బందులు కలుగకుండా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకును బుధవారం ఆకస్మికంగా సందర్శించి రుణమాఫీ నగదు చెల్లింపు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం రెండో విడతలో లక్షా యాభై వేల రుణం గల రైతులకు నగదు చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు. రెండో విడతలో 14,104 మంది రైతులకు 138కోట్ల46లక్షల56వేల254 రూపాయలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్యాంకు అధికారులు రైతులకు ఇబ్బందులు లేకుండా నగదు చెల్లింపులు చేయాల న్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి దరణి దరఖాస్తుల పరిశీలన తీరును పరిశీలించారు. ధరణి పోర్టల్‌లో చేసుకున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అలాగే కులం, ఆదాయం, నివాసం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ , ఇతర ధ్రువీకరరణ పత్రాల కోసం అందిన దరఖాస్తులను నిబంధనల మేరకు త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావుదేశ్‌పాండే, బ్యాంకు అధికారులు ఉన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 10:23 PM

Advertising
Advertising
<