ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓటర్‌ స్లిప్పుల పంపిణీ వేగవంతం చేయాలి

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:38 PM

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఓటర్‌ స్లిప్పుల పంపిణీని వేగవంతం చేయాలని ఆర్డీ వో సుబ్రహ్మణ్యం తెలిపారు.

శివన్నగూడలో ఓటు స్లిప్పులను అందజేస్తున్న తహసీల్దార్‌ శ్రీనివాస్‌

ఓటర్‌ స్లిప్పుల పంపిణీ వేగవంతం చేయాలి

ఆర్డీవో సుబ్రహ్మణ్యం

చండూరు, ఏప్రిల్‌ 26: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఓటర్‌ స్లిప్పుల పంపిణీని వేగవంతం చేయాలని ఆర్డీ వో సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని గ్రామా ల్లో ఇంటింటికి ఓటర్లకు పోలింగ్‌ స్లిప్‌లు అందజేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్‌ స్లిప్‌లు కేవలం ఓటర్లకు మాత్రమే అందజేస్తామని, వారు అందుబాటులో లేకుంటే కుటంబ పెద్దలకు మా త్రమే ఇస్తామని స్పష్టం చేశారు. ఓటు హక్కు వినియోగం గు రించి తెలియజేసేందుకు ప్రతీ ఓటరుకు ఓటర్‌ గైడ్‌ను బీఎల్వో లు అందజేయనున్నట్లు తెలిపారు. స్లిప్పుల పంపిణీ వేగవంతం చేయాలని, సిబ్బంది విధుల్లో అలసత్వం వహించరాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 2024 నాటికి మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,57,557 మంది ఉండగా, 1,28,233మంది పురుషులు, 1,29,321 మంది మహిళలు, ముగ్గురు ఇతరులు ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ ఏడాది 18ఏళ్లు నిండిన ఓటర్లు 4,909మంది కొత్తగా నమో దు చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సీనియర్‌ అసిస్టెంట్‌ సైదులు, ఎన్నికల డీటీ దీపక్‌కుమార్‌, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

మర్రిగూడ: ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ బక్క శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని శివన్నగూడ ఎన్నికల బూత పోలింగ్‌ కేంద్రాల్లో శుక్రవారం ఓటు స్లిప్పులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజలు ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎన్నికల మండల ఎన్నికల క్లస్టర్‌ అధికారి క్రాంతికుమార్‌, అంగనవాడీ టీచర్లు, ఆయాలు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మ, సువర్ణ పలువురు ఉన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:38 PM

Advertising
Advertising