ధరణి ఇదేం ధోరణి!
ABN, Publish Date - Jul 01 , 2024 | 11:14 PM
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూ సమస్యలు పరిష్కరించేందుకు పారదర్శకంగా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దినా వివిధ దశల్లో దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరగుతోంది. ఉమ్మడి జిల్లాలో 61,019 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వరుస ఎన్నికలకు తోడు రెవెన్యూ అధికారుల బదిలీ, కొత్తగా వచ్చిన అధికారులు వీటి పరిష్కారానికి అంతగా ఆసక్తి చూపక పోవడంతో దరఖాస్తుల సంఖ్య పేరుకుపోయింది. కలెక్టర్లు లేదా ఇతర రెవెన్యూ అధికారులు మారితే చాలు.. ఫైౖల్స్ అన్నీ తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు మరోపక్క ధరణి సమస్యలను పరిష్కరించాలని సమీక్షలు నిర్వహిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.
వివిధ స్థారులో పెండింగ్‌లో ధరణి దరఖాస్తులు ఇలా
మొత్తం తహసీల్దారు ఆర్డీవో అదనపు కలెక్టర్ కలెక్టర్
రంగారెడ్డి 36,463 30,026 5,024 1,038 375
మేడ్చల్ 10,000 7172 1830 707 291
వికారాబాద్ 14,556 12,660 1529 119 248
రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ మొత్తం
మొత్తం దరఖాస్తులు 40,242 10,592 15,575 66,409
పరిష్కరించినవి 3,779 592 1,019 5,390
పెండింగ్‌లో ఉన్నవి 36,463 10,000 14,556 61,019
భూ సమస్యలకు మోక్షం లభించేనా?!
ఫఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో 61,019 ధరణి దరఖాస్తులు
ఫతహసీల్దారు స్థాయిలోనే అత్యధికంగా 49,858 దరఖాస్తుల పెండింగ్
ఫస్పెషల్ డ్రైవ్‌లో 5,390 క్లియర్
ఫఅధికారులు మారినపుడుల్లా మళ్లీ ఫైల్స్ వెనక్కి
ఫ ఇప్పటికీ రంగారెడ్డి జిల్లాలో మూడు సార్లు ...
ఫతహసీల్దార్, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న బాధితులు
ఫ సమీక్షలతోనే సరిపెడుతున్న ఆఫీసర్లు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూ సమస్యలు పరిష్కరించేందుకు పారదర్శకంగా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దినా వివిధ దశల్లో దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరగుతోంది. ఉమ్మడి జిల్లాలో 61,019 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వరుస ఎన్నికలకు తోడు రెవెన్యూ అధికారుల బదిలీ, కొత్తగా వచ్చిన అధికారులు వీటి పరిష్కారానికి అంతగా ఆసక్తి చూపక పోవడంతో దరఖాస్తుల సంఖ్య పేరుకుపోయింది. కలెక్టర్లు లేదా ఇతర రెవెన్యూ అధికారులు మారితే చాలు.. ఫైౖల్స్ అన్నీ తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు మరోపక్క ధరణి సమస్యలను పరిష్కరించాలని సమీక్షలు నిర్వహిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్, జూలై 1): ఉమ్మడి జిల్లా పరిధిలో వేలసంఖ్యలో భూ సమస్యలు అపరిషృతంగానే మిగిలిపోయాయి. ఈ క్రమంలో ధరణి దరఖాస్తుల అమోదం, తిరస్కరణలకు సంబంధించి కలెక్టర్లకు మాత్రమే ఉన్న అధికారాలను విభజించారు. మండలాల వారీగా స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టి తహసీల్దార్లు నాలుగు రకాల మాడ్యుళ్లకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కరించనున్నారు. అసైన్డ్ భూములతో పాటు అన్ని రకాల వారసత్వ బదిలీ ప్రక్రియలు, భూసమస్యలకు సంబంధించిన వినతులు, తదితర సమస్యలను తహసీల్దార్లు పరిశీలించనున్నారు. మరికొన్ని సమస్యలను ఆర్డీవో పరిష్కరించనున్నారు. ధరణిలో తప్పొప్పుల సవరణ, నిషేధిత జాబితా, దస్ర్తాల ఆధునికీకరణ తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను మండల, జిల్లా స్థాయిలోనే పరిష్కరించేలా అదేశాలిచ్చినా... ఫలితం లేకుండా పోతుంది.
స్పెషల్ డ్రైవ్‌లో పరిష్కారం
ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో జూన్ 15 నుంచి 28వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక భూ సమస్యలు తెరపైకి వచ్చాయి. ఖాతా, సర్వేనెంబర్లు మిస్సింగ్, తప్పులు, పట్టాదారుపేర్లు, ఫొటోల్లో తప్పులు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, పట్టా, ఆసైన్డ్ భూములు ప్రభుత్వ భూములుగా నమోదు వంటి వాటిలో తప్పులు దొర్లాయి. అలాగే మ్యుటేషన్లు, సక్సెషన్, నాలా, జీపీఏ, పీవోబీ, కోర్టు కేసులు, పాస్‌బుక్ డేటా కరెక్షన్ తదితర దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ధరణి పోర్టల్ టీఎం 33 మాడ్యుల్స్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించక పోవడంతో బాధితులు తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను స్పెషల్ డ్రైవ్‌లో డిస్పోజ్ చేయాలని సూచించింది. ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5,390 దరఖాస్తులను పరిష్కరించారు. అందులో రంగారెడ్డి జిల్లాలో 3779, మేడ్చల్ జిల్లాలో 592, వికారాబాద్ జిల్లాలో 1,019 దరఖాస్తులను పరిష్కరించారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో ఇంకా 61,019 దరఖాస్తులు పెండింగ్‌లో చాలా ఉన్నాయి.
డేటా కరెక్షన్ దరఖాస్తులే అధికం
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తులు సంబంధించి రంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా ధరణికి సంబంధించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తహసీల్దారు స్థాయిలోనే రంగారెడ్డి జిల్లాలో 30,026 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా మేడ్చల్ జిల్లాలో 7,172 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ధరణి పెండింగ్ దరఖాస్తుల్లో అధికంగా డేటా కరెక్షన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్నాయి. వాటి తర్వాత స్థానం పెండింగ్ మ్యుటేషన్, సక్సేషన్, ల్యాండ్ మ్యాటర్ గ్రీవెన్స్‌కు సబంధించి పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో డేటా కరెక్షన్‌కు సంబధించి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 15,875 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, వికారాబాద్ జిల్లాలో 5,255 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.. అలాగే మేడ్చల్ జిల్లాలో 2,915 దఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
నిషేధిత జాబితాల్లో...
నిషేధిత జాబితాల్లో రంగారెడ్డి జిల్లాలో 7,153 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా వికారాబాద్ జిల్లాలో 1,636, మేడ్చల్ జిల్లాలో 3,164 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు కేసులకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో అధిక మొత్తంలో 3,576 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా మేడ్చల్ జిల్లాలో 798 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ మ్యుటేషన్ రంగారెడ్డిలో 3,438 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా మేడ్చల్‌లో 1,165 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సక్సేషన్‌కు సంబంధించి రంగారెడ్డిలో 1,381 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా మేడ్చల్‌లో 522 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వరుస ఎన్నికలకు తోడు రెవెన్యూ అధికారుల బదిలీ, కొత్తగా వచ్చిన అధికారులు వీటి పరిష్కారానికి అంతగా ఆసక్తి చూపక పోవడంతో దరఖాస్తుల సంఖ్య పేరుకుపోయింది.
అధికారులు మారితే చాలు..
కలెక్టర్లు లేదా ఇతర రెవెన్యూ అధికారులు మారితే చాలు.. ఫైౖల్స్ అన్నీ తిరిగి వెనక్కీ పంపించేస్తున్నారు. శాసన సభ ఎన్నికల సమయంలో ముగ్గురు కలెక్టర్లు మారారు. కొత్త కలెక్టర్ వచ్చినప్పుడల్లా ధరణి దరఖాస్తులను తిరిగి వెనక్కీ పంపించేశారు. అలాగే రెవెన్యూ ఉన్నతాధికారులు మారినప్పుడు కూడా ఇలానే జరుగుతోంది. ఇప్పటి వరకు మూడు సార్లు ఫైౖల్స్ తిరిగి పంపిండంతో తహసీల్దారు స్థాయిలో ధరణి దరఖాస్తులు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
ధరణి సమస్యలపై ప్రత్యేక డ్రైవ్: అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి
మేడ్చల్(ఆంధ్రజ్యోతి) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ధరణి సమస్యలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో ధరణి సంబంధించి దాదాపు 10వేల దరఖాస్తులు రాగా అందులో కేవలం 592 మాత్రమే పరిష్కారమయ్యాయి. వేలసంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోవడంతో త్వరితగతిన వాటిని పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లోనే 5 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. తహసీల్దార్‌లు, ఆర్డీవోలు ప్రతి రోజు కలెక్టరేట్‌లోనే వారి సిబ్బందితో కలిసి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
నిషేధిత జాబితాలో పట్టా భూమి .. అమ్ముకోలేక పోతున్నా
నాకు చేవెళ్ల మండలం, కమ్మెట గ్రామం సర్వేనెంబర్ 71/అ/1/3లో ఎకరం, సర్వేనెంబర్ 88/ఆ/2/3వి 11లో 10 గుంటలు భూమి ఉంది. మొత్తం 1.10 గుంటల భూమి ఉంది. ధరణిలో నిషేధిత జాబితాలో పడింది. దీంతో నేను అమ్ముకోలేక పోతున్నా. పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి తీసి వేయాలని పలు మార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశాను. సమస్య అలాగే ఉంది.
తల్లారి సంజీవ, బాధిత రైతు, కమ్మెట గ్రామం
Updated Date - Jul 02 , 2024 | 12:22 AM