ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు వచ్చారు
ABN, Publish Date - May 07 , 2024 | 05:31 AM
ఢిల్లీ పోలీసులు ఏ అధికారంతో తెలంగాణలో దిగారని కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి ప్రశ్నించారు. ఏ హక్కుతో గాంధీభవన్‌కు వచ్చి తమ వారిపై
రేణుకా చౌదరి
హైదరాబాద్, మే 6(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ పోలీసులు ఏ అధికారంతో తెలంగాణలో దిగారని కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి ప్రశ్నించారు. ఏ హక్కుతో గాంధీభవన్‌కు వచ్చి తమ వారిపై కేసులు పెడుతున్నారని నిలదీశారు. తెలంగాణ తడాఖా ఏంటో చూపించాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. బీజేపీ వారికి దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్నను పట్టుకోవాలని ఆమె అన్నారు. రేవణ్నను బలపరిస్తే తనను బలపర్చినట్లేనంటూ ప్రధాని మోదీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు.
Updated Date - May 07 , 2024 | 08:31 AM