ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కేంద్రంలో కాంగ్రె్‌సదే అధికారం

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:40 PM

కేంద్రంలో కాంగ్రెస్‌ ప్ర భుత్వం అధికారంలోకి వస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని సీఎల్పీ మాజీ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు.

చింతపల్లిలో గ్యారెంటీ కార్డుల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జానారెడ్డి, రఘువీర్‌రెడ్డి

కేంద్రంలో కాంగ్రె్‌సదే అధికారం

దేవరకొండ, నాగార్జునసాగర్‌, ఏప్రిల్‌ 26: కేంద్రంలో కాంగ్రెస్‌ ప్ర భుత్వం అధికారంలోకి వస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని సీఎల్పీ మాజీ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. చిం తపల్లి మండలంలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని రేవంతరెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందన్నారు. ఆరు గ్యా రెంటీలను పేదలందరికీ అందిస్తుందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్రీశై లం సొరంగమార్గం, నక్కలగండి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుం డా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. మాజీ మంత్రి హరీ్‌షరావు ప్రజా స మస్యలను పట్టించుకోలేదని కాంగ్రె్‌సపై విమర్శలు చేయడం సరికాదన్నా రు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీరారెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే దేవరకొండ ని యోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి న ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకే దక్కిందని పేర్కొన్నారు. నల్లగొం డ పార్లమెంట్‌ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో తనను ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ఎమ్మెల్యే బాలునాయక్‌ సహకారంతో అభివృద్ధి చేస్తానన్నారు. ఎమ్మెల్యే బాలునాయక్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పో స్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు ఎరుకల వెం కటయ్యగౌడ్‌, అంగిరేకుల నాగభూషణం, పవనకుమార్‌, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేధావులు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలి

మేధావులు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని, త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో లౌకిక, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పో రాడాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. సాగర్‌ హిల్‌కాలనీలోని జానారెడ్డి నివాసంలో శుక్రవారం సాయంత్రం ఉమ్మడి ఏపీ సమాచార హక్కు ప్రధాన మాజీ కమిషనర్‌ డాక్టర్‌ వర్రె వెంకటేశ్వర్లు ఆ ధ్వర్యంలో విశ్రాంత ఇనఎనసీ ఎంఏ కరీం, సీనియర్‌ జర్నలిస్టు దైవాదీనం ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ దేశంలో సు పరిపాలన కోసం యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కుతో పాటు, లోక్‌ పాల్‌ బిల్లు, పోక్సో, గృహహింస, వయోవృద్ధుల సంక్షేమ, విద్యాహక్కు, ఉ పాధిహామీ చట్టాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రె్‌సకే దక్కిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో చట్టాలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. వాటిని పరిరక్షించడానికి మేధావులు, విద్యావంతులు, ఆర్టీఐ కార్యకర్తలు, క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. దేశంలో కాంగ్రె్‌సను గెలిపించాల్సి అవసరం ఉందన్నా రు. నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల రాష్ట్ర నాయకులు వై. కృష్ణారెడ్డి, ఖుర్షీద్‌పాష, ముకుందరెడ్డి, హేమలత, సైదులుగౌడ్‌, అడ్వకేట్లు, పాత్రికేయులు, ఆర్టీఐ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రఘువీర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి : లక్ష్మారెడ్డి

అడవిదేవులపల్లి: పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నల్లగొండ ఎంపీ అ భ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డిని రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుల స మావేశంలో ఆయన డీసీసీ అధ్యక్షుడు కేతావత శంకర్‌నాయక్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. మండలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువగా రఘువీర్‌రెడ్డికి వచ్చేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ కార్యకర్తలు తిరిగి ప్రచారం చేసి రఘువీర్‌రెడ్డి గెలుపునకు కృ షి చేయాలన్నారు. రఘువీర్‌రెడ్డి గెలుపును జానారెడ్డికి బహుమానంగా ఇ వ్వాలన్నారు. అదేవిధంగా ఎంత మంది కొత్త నాయకులు పార్టీలోకి వచ్చి నా గతం నుంచి పార్టీ కోసం పనిచేసి నాయకులకే ప్రాధాన్యత ఉంటుంద ని, కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కా ర్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్‌, పార్టీ మండల అ ధ్యక్షుడు బాలునాయక్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు స్కైలాబ్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:40 PM

Advertising
Advertising