ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manchiryāla- వ్యాధుల పంజా

ABN, Publish Date - Aug 21 , 2024 | 10:34 PM

జిల్లాలో వ్యాధులు పంజా విసురుతున్నాయి. వైరల్‌ జ్వరాలతో ప్రజ లు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగినంత వైద్యులు, సిబ్బంది లేక పోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర పరిస్థితులు ఉంటే ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందు తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో పదుల సంఖ్యలో జ్వరాల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.

బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

- ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత

- అరకొర వైద్య సేవలతో రోగుల అవస్థలు

జిల్లాలో వ్యాధులు పంజా విసురుతున్నాయి. వైరల్‌ జ్వరాలతో ప్రజ లు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగినంత వైద్యులు, సిబ్బంది లేక పోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర పరిస్థితులు ఉంటే ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందు తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో పదుల సంఖ్యలో జ్వరాల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.

బెల్లంపల్లి, ఆగస్టు 21: వర్షాకాలం నేపథ్యంలో కలుషిత నీరు, పరి సరాల అపరిశుభ్రతతో జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దోమల బెడదతో ప్రజలు డెంగీ, టైఫాయిడ్‌, మలేరియా తదితర విష జ్వరాల బారిన పడుతున్నారు. ఈ నేపఽథ్యంలో పలువురు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందాలంటే పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో రోగులు అరకొర వైద్య సేవలతో అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్యం అందకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు ప్ర జలు పరుగులు పెడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ ఆ స్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించి పూర్తిస్థాయిలో వైద్యులను నియమించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

- పెరిగిన ఓపీ..

జిల్లాలో రోజు రోజుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జ్వరాలతో చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆస్పత్రుల్లో మామూలు రోజు ల్లో ప్రతి రోజు వంద ఓపీలు ఉండగా ప్రస్తుతం 250 నుంచి 300ల వరకు ఓపీలు ఉంటున్నాయి. ఇటీవల సీజనల్‌ వ్యాధులపై సంబంధిత వైద్య శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా జ్వరాల సర్వే చేపట్టగా 2 వేల మంది జ్వరాల బారిన పడినట్లు గుర్తించారు. అలాగే డెంగీ కేసులు సైతం 53 నమోదయ్యాయి. మరికొంత మంది జ్వరాల బారిన పడిన వారి రక్తనమూనాలను పరీక్షల కోసం తీసుకువెళ్లారు. పారిశుధ్యం లోపించడంతో పాటు దోమకాటుతో జ్వరాలు వస్తున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జ్వరాల బారిన పడుతున్నారు.

- సిబ్బంది కొరత..

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరతతో రోగులకు అరకొర వైద్య సేవలందుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. జి ల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరులోని 30 పడకల ఆస్పత్రులను గత ప్రభుత్వం వంద పడకల ఆస్పపత్రులుగా అప్‌గ్రేడ్‌ చేసింది. ఇందుకు తగినట్లుగా కోట్ల రూపాయల వ్యయంతో నూతన ఆస్పత్రులను సైతం నిర్మించింది. ఆస్పత్రి హోదా పెరిగినప్పటికీ వైద్యులను నియమించలేదు. బెల్లంపల్లిలోని ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో మొత్తం వైద్యులు, వైద్య సిబ్బంది 62 మంది అవసరం ఉండగా కేవలం 28 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మరో 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే చెన్నూరు 30 పడకల ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌గా చేశారు. 30 పడకలకు సంబం ధించిన వైద్యులు సిబ్బంది ఉన్నారు. వంద పడకల ఆస్పత్రిలో సేవలందించేందుకు 27 మంది వైద్యులు, వైద్య సిబ్బంది అవసరం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నియమించలేదు. మంచిర్యాల జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో 80 వైద్యులు, సిబ్బందికి సంబంధించిన నియామకాలు ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. జి ల్లాలోని మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానాల్లో సైతం వైద్య సిబ్బంది కొరత వేధిస్తుండడంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదు. అలాగే పలువురు వైద్యులు డిప్యూటేషన్‌ కిం ద విదులు నిర్వహిస్తుండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నా రు. చెన్నూరు, బెల్లంపల్లిలో వంద పడకల ఆస్పత్రులు ప్రారంభించి మూ డేళ్లు పూర్తవుతున్నా నేటి వరకు ఐసీయూ వార్డు ప్రారంభిం చలేదు. దీంతో ఎవరికైనా అత్యవసర వైద్యం అవసరమైతే ఇతర ప్రాంతాలకు రెఫర్‌ చేస్తున్నారు.

- ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు..

జిల్లాలో విష జ్వరాలతో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన ప్పటికీ మెరుగైన వైద్యం అందకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆస్పత్రు లకు వెళ్లక తప్పడం లేదు. ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తుండడంతో ఆస్పత్రుల్లో వేల రూపాయల ఫీజులు కడుతూ ఆర్ధికంగా నష్టపోతున్నారు. జిల్లాలోని ఏ ప్రైవేటు ఆస్పత్రిని చూసినా రోగులు పెద్ద సంఖ్యలో కనబడుతున్నారు. ఇదే అదనుగా కొందరు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అందిన కాడి కి దండుకుంటున్నారు. ఏకంగా కొందరైతే ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయని భయపెడుతూ ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సర్జరీలు, ముఖ్యమైన చికిత్సలు అందకపోవడం, సరైన వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. వైరల్‌ ఫీవర్‌తో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఒక్కో పేషెంట్‌కు రోజుకు మందులు, ఓపీ ఫీజు, వివిధ పరీక్షల పేరుతో రూ. 2 వేల నుంచి 3 వేల వరకు వసూలు చేస్తున్నారు. పూర్తిస్ధాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని నియమించి మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు.

సరిపడా సిబ్బందిని నియమించాలి..

- వెంకటేష్‌, బెల్లంపల్లి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బందిని నియమించాలి. ప్రజాప్రతి నిధులు ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి. గ్రామీణ ప్రాంత, పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం కోసం వెళితే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిం చేందుకు చర్యలు తీసుకోవాలి.

ఆర్థికంగా ఇబ్బందులు..

- శ్రీనివాస్‌, బెల్లంపల్లి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు వస్తే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో చెన్నూరు, బెల్లంపల్లి ఆస్పత్రులను అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధి కారులు తగిన చర్యలు తీసుకోవాలి.

Updated Date - Aug 21 , 2024 | 10:34 PM

Advertising
Advertising
<