ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అవసరాన్ని బట్టి కొత్త బస్సులు కొనండి

ABN, Publish Date - Sep 11 , 2024 | 05:48 AM

ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. కొత్త రూట్లు, పెరిగిన అవసరాల మేరకు ఎన్ని బస్సులు అవసరమో గుర్తించాలన్నారు. మంగళవారం ఆయన ఆర్టీసీ పనితీరు, అవసరాలపై తొలిసారి సమీక్ష నిర్వహించారు. మహాలక్ష్మి పథకం అమలు, దాన్ని మహిళలు

ఆర్టీసీ రుణ భారం.. తగ్గించేందుకు ప్రయత్నించండి

ఆర్టీసీపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. కొత్త రూట్లు, పెరిగిన అవసరాల మేరకు ఎన్ని బస్సులు అవసరమో గుర్తించాలన్నారు. మంగళవారం ఆయన ఆర్టీసీ పనితీరు, అవసరాలపై తొలిసారి సమీక్ష నిర్వహించారు. మహాలక్ష్మి పథకం అమలు, దాన్ని మహిళలు వినియోగించుకుంటున్న తీరుపై రేవంత్‌ ఆరా తీశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ దీనిపై స్పందిస్తూ.. సీఎంకు వివరాలను అందజేశారు. మహాలక్ష్మి అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని వివరించారు. ఇప్పటి వరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు. దీని వల్ల మహిళా ప్రయాణికులకు రూ.2,840,71 కోట్ల మేర ఆదా అయ్యిందని తెలిపారు. ఆర్టీసీలోని 7,292 బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తోందని వెల్లడించారు. పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైరదాబాద్‌లోని ఆస్పత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోందని చెబుతూ.. అందుకు సంబంధించిన ఫొటోలు, వార్తలతో ప్రెజంటేషన్‌ ఇచ్చారు. ఆర్టీసీకి వివిధ బ్యాంకులు, ఉద్యోగుల భవిష్యత్‌ నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కలిపి రూ.6,322 కోట్ల రుణాలు ఉన్నట్లు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ బ్యాంకు రుణాలకు చెల్లిస్తున్న వడ్డీ రేటు ఎక్కువగా ఉందని.. దాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించాలని సూచించారు. అప్పుల తీరుతెన్నులపై పునఃపరిశీలన చేసి, సంస్థకు క్రమంగా రుణ భారం తగ్గించాలని ఆదేశించారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని, ప్రభుత్వం ఈ పథకానికి చెల్లిస్తున్న రీయింబర్స్‌మెంట్‌ సంస్థ లాభాల్లో భాగమవుతోందని అధికారులు సీఎంకు వివరించారు.


ఉద్యోగుల నారాజ్‌

సీఎం రేవంత్‌ మొదటిసారిగా ఆర్టీసీపై సమీక్ష చేపట్టడంతో ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ, యూనియన్ల పునరుద్ధరణ, బాండ్ల డబ్బుల అంశం చర్చకు వస్తాయని ఆశించారు. ఈ సమావేశం తమను నిరాశపరిచిందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ ఇ.అశ్వత్థామ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఒక్క హామీని కూడా ఈ సమావేశంలో చర్చకు స్వీకరించలేదని విమర్శించారు. సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న తమ డిమాండ్లకు పరిష్కారం లభించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలపై ప్రకటన చేయాలనీ, లేని పక్షంలో అన్ని యూనియన్లతో కలిసి ఉమ్మడి పోరాటాలకు కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.

Updated Date - Sep 11 , 2024 | 05:48 AM

Advertising
Advertising