ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బస్సు షెల్టర్‌ లేక అవస్థలు

ABN, Publish Date - Jun 07 , 2024 | 11:24 PM

మండల పరిధిలోని గూడెబల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని టైరోడ్‌ వద్ద బస్సు షెల్టర్‌ లేక ప్రయాణికులు అవస్థ పడుతున్నారు.

రోడ్డుపై నిలబడి బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు

కృష్ణ, జూన్‌ 7: మండల పరిధిలోని గూడెబల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని టైరోడ్‌ వద్ద బస్సు షెల్టర్‌ లేక ప్రయాణికులు అవస్థ పడుతున్నారు. బస్సుల కోసం జాతీయ రహదారిపై ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రాష్ర్టాల సరిహద్దు మండలం కావడం వల్ల వందలమంది ప్రయాణికులు హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, తూర్పు గోదావరి, రాజమండ్రి, బళ్లారి, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. టైరోడ్‌ వద్ద ప్రయాణికుల కోసం బస్సు షెల్టర్‌ లేకపోవడంతో వృద్ధులు, చిన్న పిల్లలు రోడ్డుపైనే కూర్చుంటున్నారు. బస్సు కోసం వేచి చూసే క్రమం ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సంబంధిత అధికారులు స్పందించి ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్‌ నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:24 PM

Advertising
Advertising