ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Manchiryāla- భీమయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి

ABN, Publish Date - Apr 24 , 2024 | 11:29 PM

మద్దిమాడ పోలీసు కాల్పుల్లో అమరుడైన చేనేని భీమయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నాయకపోడ్‌ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు అన్నారు. మద్దిమాడలో చేనేని భీమయ్య 36వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సంప్రదాయబద్దంగా పూజలు చేశారు.

భీమయ్య విగ్రహం వద్ద పూజలు చేస్తున్న నాయకపోడ్‌ సంఘం సభ్యులు

కాసిపేట, ఏప్రిల్‌ 24: మద్దిమాడ పోలీసు కాల్పుల్లో అమరుడైన చేనేని భీమయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నాయకపోడ్‌ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు అన్నారు. మద్దిమాడలో చేనేని భీమయ్య 36వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సంప్రదాయబద్దంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రభుత్వాలు భీమయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించడాన్ని విస్మరించాయన్నారు. ఇది సరైంది కాదని చెప్పారు. అధికారికంగా నిర్వహించాలన్నారు. పోలీసు కాల్పుల అనంతరం జిల్లా అధికారులు వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను బాధిత కుటుంబాలకు అందించాలన్నారు. అంతకుముందు సంప్రదాయ వాయిద్యాలతో ర్యాలీగా తరలి వచ్చి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, మాజీ సర్పంచులు రొడ్డ రమేష్‌, ఆడె జంగు, నాయకపోడ్‌ సంఘం నాయకులు భీంరావు, రాజన్న, భార్గవ్‌, శ్రీనివాస్‌, మేండ్రపు రాజన్న, మహేందర్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:29 PM

Advertising
Advertising