మేలైన రెవెన్యూ చట్టమే ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:21 PM
మేలైన రెవెన్యూ చట్టమే ప్రభుత్వ లక్ష్య మని, ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ముసాయిదా నూతన రెవెన్యూ చట్టా న్ని పటిష్టం చేసేందుకు నిపుణులు, మేధావులు ఇచ్చిన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
- అభిప్రాయ సేకరణలో కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, ఆగస్టు 24: మేలైన రెవెన్యూ చట్టమే ప్రభుత్వ లక్ష్య మని, ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ముసాయిదా నూతన రెవెన్యూ చట్టా న్ని పటిష్టం చేసేందుకు నిపుణులు, మేధావులు ఇచ్చిన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ హక్కుల రికార్డు ముసాయిదా బిల్లు-2024 చట్టంపై అవగాహన చర్చ, సూచనలు, స్వీకరణ కార్యక్రమా న్ని నిర్వహించారు. రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు, విఽశ్రాంత రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ముందుగా తహసీల్దార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వా రా నూతన ప్రతిపాదిత రైట్స్ ఆఫ్ రికార్డు(ఆర్‌ఓఆర్) చట్టాన్ని వివరించారు. అంతేగాక 2020 ఆర్‌ఓఆర్ చట్టం,-2024 ప్రతిపాదిత చట్టాలలోని తేడాలను సైతం వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇంకా మె రుగైన భూ రికార్డుల విధానాన్ని తీసుకువచ్చేందుకు 2020 చట్టం స్ధానంలో 2024 చట్టం తెచ్చే క్రమంలో భాగంగా క్షేత్రస్ధాయిలో సూచనలు, సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుకే చర్చను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు భూములకు సంబంధించిన హక్కు ల సమస్యలు, మ్యుటేషన్, ధరణిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నూతన చట్టంలో తీసుకురావాల్సిన వివిధ అంశాల గురించి సలహాలు, సూచనలు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు నర్సింగరావు, శ్రీనివాసరావు, ఆర్డీవో రాంచందర్, ఏవో వీరభద్రప్ప, జడ్పీసీఈవో కాంతమ్మ, ప్రజాప్రతినిధులు, తహసీల్దార్లు, సీనియర్ సిటిజన్లు, మేధావులు తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టుల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
ధరూరు : జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణను పకడ్బందీ గా చేపట్టి చివరి ఆయకుట్టు వరకు రైతులకు సాగునీటిని అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ధరూ రు మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టుతో పాటు గుడ్డెందొడ్డి, రిజర్వాయర్, గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పంప్‌హౌజ్‌లను సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం ఎంత ఉంటుం ది, ఖరీఫ్, రబీ సీజన్‌లకు ఆయకట్టుకు నీటి విడుదల చేసే విధానం తదితర వివరాలను ఇంజ నీర్లతో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే చివరిగా స్టేజ్-1, 2 పంప్ హౌస్‌లను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట ప్రాజెక్టు ఇరిగేషన్ ఇంజ నీర్లు, ఈఈ రహీముద్దీన్, డ్యాం ఈఈ జుబేర్, డీఈ ప్రవీణ్ కుమార్, ఇతన ఇరిగేషన్ అధికారులు, ఏఈలు ఉన్నారు.
Updated Date - Aug 24 , 2024 | 11:21 PM