ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Manchiryāla- పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

ABN, Publish Date - May 12 , 2024 | 10:53 PM

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ర్టిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలను డీసీపీ అశోక్‌కుమార్‌, ఆర్డీవో రాములు, ఏసీపీ ప్రకాష్‌తఓ కలిసి సందర్శించి ఎన్నికల సిబ్బందికి ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను పంపిణీ చేశారు.

పోలింగ్‌ సిబ్బందికి సామగ్రి అందజేస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

మంచిర్యాల కలెక్టరేట్‌ మే 12: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ర్టిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలను డీసీపీ అశోక్‌కుమార్‌, ఆర్డీవో రాములు, ఏసీపీ ప్రకాష్‌తఓ కలిసి సందర్శించి ఎన్నికల సిబ్బందికి ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. చెన్నూరు సెగ్మెంట్‌లో 227 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి 227 మంది ప్రిసైడింగ్‌, 272 మంది సహాయ ప్రిసైడింగ్‌, 544 మంది ఇతర ప్రిసైడింగ్‌ అధికారులు, 30 మంది సూక్ష్మ పరిశీలకులు ,28 మంది సెక్టార్‌ అధికారులను నియమించామని తెలిపారు. బెల్లంపల్లి సెగ్మెంట్‌లో 227 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి 227 మంది ప్రిసైడింగ్‌, 272 మంది ,272 మంది సహాయ ప్రిసిఐడింగ్‌, 544 ఇతర ప్రిసైడింగ్‌ అధికారులు, 33 మంది సూక్ష్మ పరిశీలకులు, 30 మంది సెక్టార్‌ అధికా రులను నియమించినట్లు వివరించారు. మంచిర్యాల సెగ్మెం ట్‌లో 287 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి 344 ప్రిసైడింగ్‌, 344 మంది సహాయ ప్రిసైడింగ్‌, 688 మంది ఇతర ప్రిసైడింగ్‌ అధికారులు, 32 మంది సూక్ష్మ పరిశీల కులు, 30 మంది సెక్టార్‌ అధికారులను నియమించామని తెలిపారు.

బెల్లంపల్లి: జిల్లాలో సోమవారం నిర్వహంచే పార్లమెంట్‌ ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, రామగుం డం సీపీ శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని తిలక్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌తో కలిసి పరిశీలించారు. ఎలాంటి అవాంచనీ

య సంఘటనలకు తావు లేకుండా పూర్తి భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Updated Date - May 12 , 2024 | 10:53 PM

Advertising
Advertising