ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మరో ట్విస్ట్.. మాజీ డీసీపీకి రిమాండ్..

ABN, Publish Date - Mar 29 , 2024 | 08:02 PM

ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కొందరు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కొందరు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ తర్వాత అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌ రావు (Radhakishan Rao)ను ఫోన్ ట్యాపింగ్ కేసులో అదుపులోకి తీసకోగా.. ఆయనను కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు. ఆయనకు 14రోజుల రిమాండ్‌ను న్యాయమూర్తి విధించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లో పని చేసిన సమయంలో సస్పెండ్‌కు గురైన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు (praneeth Rao) ఇచ్చిన సమాచారం ఆధారంగా రాధాకిషన్‌రావు బృందం అనధికారికంగా ఫోన్లు ట్యాప్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి బంజారాహిల్స్ స్టేషన్‌లో రాధాకిషన్‌రావును విచారించిన దర్యాప్తు బృందం ఈరోజు ఆయనను అరెస్ట్ చూపించింది. దీంతో గాంధీ ఆసుప్రతిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు ఆయనను పోలీసులు ప్రవేశ పెట్టారు. జడ్జి రిమాండ్ విధించడంతో రాధాకిషన్‌రావును చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Phone Tapping: మొత్తం ఆయనే చేశారు.. ఫోన్ ట్యాపింగ్‌లో సంచలనం

కస్టడీకి నిరాకరణ

మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్ కాగా.. వారిద్దరు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా వారిద్దరికి ఏప్రిల్ 2వరకు కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న మరో నిందితుడు ప్రణీత్‌రావును కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది.

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 29 , 2024 | 08:02 PM

Advertising
Advertising