ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Manchiryāla- ఇంటర్‌లో అడ్మిషన్‌లు ప్రారంభం

ABN, Publish Date - May 12 , 2024 | 11:00 PM

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్మిషన్‌లకు మాధ్యమిక విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

మంచిర్యాలలోని టీఎస్‌మోడల్‌ జూనియర్‌ కాలేజీ

- అన్ని వసతులతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు

ఏసీసీ, మే 12: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్మిషన్‌లకు మాధ్యమిక విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 31 వరకు ఆన్‌లైన్‌లో అడ్మిషన్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ఎయిడెడ్‌ సాంగీక సంక్షేమ ,గిరిజన ,మైనార్టీ గురుకుల , మోడల్‌ జూనియర్‌ కళాశాలల్లో ఒకేసారి అడ్మిషన్‌లు నిర్వహించనున్నారు.

- అందుబాటులో 20 కోర్సులు..

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో విద్యార్థులకు జనరల్‌ సైన్స్‌ విభాగంలో ఎంపీసీ, బైపీసీ, హ్యూమానిటీస్‌ విభాగంలో ఎంఈసీ, హెచ్‌ఈసీ, హెచ్‌జీఈ, సీఈసీ, సీఈజీ వంటి 20 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకేషనల్‌ విభాగంలో అగ్రికల్చర్‌, బిజినెస్‌ అండ్‌ కామర్స్‌, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సులు, హోంసైన్స్‌కు సంబంధించిన 21 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జనరల్‌ విభాగంలో దాదాపు అన్ని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ , హెచ్‌ఈసీ విభాగాల్లో ఒక్కో గ్రూపులో దాదాపు 60 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.ఒకేషనల్‌కు సంబంధించి ఆయా కోర్సులు పొందిన అడ్మిషన్‌లనుబట్టి సీట్ల సంఖ్యను నిర్ణయిస్తారు.

- 16 కళాశాలలు..

జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, సోషల్‌ వెల్ఫేర్‌ , బీసీ, మైనార్టీ వెల్ఫేర్‌, రెసిడెన్షియల్‌, మోడల్‌ జూనియర్‌ కళాశాలలు 6 , మొత్తం 16 ప్రభుత్వ యాజమా న్యాల కళాశాలలు అందుబటులో ఉన్నాయి. ప్రతి కళాశాలలో సైన్స్‌ విద్యార్థులకు అవస రమైన సైన్స్‌ ల్యాబ్‌, పరికరాలు, ఒకేషనల్‌ విద్యార్థులకు అవసరమైన పరికరాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారు. దారిద్రరేఖకు దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులందరికి స్కాలర్‌షిప్‌ కూడా ప్రభుత్వం అందిస్తుంది. ప్రైవేటుకు ధీటుగా మెరుగైన ఫలితాలు కూడా వస్తున్నాయి.

Updated Date - May 12 , 2024 | 11:01 PM

Advertising
Advertising