ఆర్‌వోఆర్ చట్టంపై సూచనలను ప్రభుత్వానికి నివేదిస్తాం
ABN, Publish Date - Aug 24 , 2024 | 10:05 PM
ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్‌వోఆర్ చట్టం ముసా యిదాపై నిపుణులు, మేధావులు, విశ్రాంత రెవెన్యూ అధికారులు అందించిన సూచనలు, సలహాలను ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నూతన ఆర్‌వోఆర్ చట్టం ముసాయిదాపై న్యాయవాదులు, విద్యావేత్త లు, విశ్రాంత రెవెన్యూ అధికారులతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 24: ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్‌వోఆర్ చట్టం ముసా యిదాపై నిపుణులు, మేధావులు, విశ్రాంత రెవెన్యూ అధికారులు అందించిన సూచనలు, సలహాలను ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నూతన ఆర్‌వోఆర్ చట్టం ముసాయిదాపై న్యాయవాదులు, విద్యావేత్త లు, విశ్రాంత రెవెన్యూ అధికారులతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతన ఆర్‌వోఆర్ ముసాయిదా బిల్లుపై నిపుణులు అందించిన సలహాలను సీసీఎల్‌ఏకు నివేదిస్తామ న్నారు. రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కా రానికి నూతన చట్టాన్ని రూపొందించేందుకు ప్రభు త్వం నిర్ణయించిందని తెలిపారు. నూతన చట్టం రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేయా లనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్చ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. రైతు సం ఘాలు, మేధావులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, సలహాలు, సూచనలను రాత పూర్వకంగా కలెక్టరేట్ కార్యాలయంలో అందించాలని, వాటిని ఒక నివేదిక రూపంలో తయారు చేసి సీసీఎల్‌కు అప్పగిస్తామని తెలిపారు. ధరణి పోర్టల్ పేరు మార్పు, నోషనల్ పట్టా సమస్యలను పరిష్క రించాలని, పట్టాదారు మృతి చెందితే వారసత్వ భూ ముల బదలాయింపులో ప్రక్రియ వేగవంతం, పోర్టల్ ఉపయోగించేందుకు ప్రత్యేక సాప్ట్‌వేర్, నూతన చట్టం అమలుకు ప్రతీ గ్రామానికి రెవెన్యూ ఉద్యోగి ఉండే విధంగా చర్యలు తీసుకోవా లని పలువురు అభిప్రాయపడ్డారు. అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు రాములు, హరికృష్ణ, విశ్రాంత తహసీల్దార్‌లు, రెవెన్యూ అధికారులు, న్యాయవా దులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Aug 24 , 2024 | 10:05 PM