ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వర్షానికి కొట్టుకపోయిన తాత్కాలిక వంతెన

ABN, Publish Date - Jul 15 , 2024 | 10:31 PM

మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నీల్వాయి నుంచి మామడ గ్రామానికి వెళ్ళే రోడ్డు మార్గంలో ఉన్న ఒర్రెపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకపోయింది. దీంతో మామడ గ్రామ స్థులు నీల్వాయి, వేమనపల్లి గ్రామాలకు కాలినడకన రావాల్సిన పరిస్థితి నెలకొంది.

వేమనపల్లి, జూలై 15 : మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నీల్వాయి నుంచి మామడ గ్రామానికి వెళ్ళే రోడ్డు మార్గంలో ఉన్న ఒర్రెపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకపోయింది. దీంతో మామడ గ్రామ స్థులు నీల్వాయి, వేమనపల్లి గ్రామాలకు కాలినడకన రావాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షానికి తాత్కాలిక వంతెనపై పోసిన మట్టి, ఇసుక బస్తాలు పూర్తిగా కొట్టుకపోవడంతో కనీసం ద్విచక్ర వాహనాలు సైతం వెళ్ళలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. వర్షానికి నీల్వాయి గ్రామంలో అల్లూరి ధర్మయ్య, చెన్నూరి బాలయ్య, గురుండ్ల నామ్‌దేవ్‌లకు చెందిన పెంకుటిల్లు కూలిపోయాయి. వర్షం పడు తున్నప్పుడు ఆ ఇళ్లల్లో వారు లేక పోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు.

జిల్లాలో 23.3 మిల్లీమీటర్ల వర్షం

మంచిర్యాల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడిచిన 24 గంటల్లో 23.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వేమనపల్లి మండలంలో 138.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చెన్నూరు మండలంలో 70.5 మిల్లీమీటర్లు, కోటపల్లి 69.3, భీమారం 24.1, నెన్నెల మండలంలో 16.4, కన్నెపల్లి 16.2, భీమిని 12.2, జైపూర్‌ మండలంలో 8.5, బెల్లంపల్లి మండలంలో 8.1, తాండూరు 7.8, లక్షెట్టిపేట 7.5, హాజీపూర్‌ మండలంలో 6.8, కాసిపేట, దండేపల్లి మండలాల్లో 6.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

Updated Date - Jul 15 , 2024 | 10:31 PM

Advertising
Advertising
<