ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kumaram Bheem Asifabad: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

ABN, Publish Date - Apr 27 , 2024 | 11:11 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 27: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను పూర్తిగా నివారిం చడానికి శనివారం సాయంత్రం 4నుంచి 6గంటలవరకు ఎస్పీ ప్రత్యేకడ్రైవ్‌ నిర్వహించారు.

- ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 27: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను పూర్తిగా నివారిం చడానికి శనివారం సాయంత్రం 4నుంచి 6గంటలవరకు ఎస్పీ ప్రత్యేకడ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో పాతనేరస్తులు, గంజాయి కేసులలో దొరికిన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జిల్లాలోగంజాయిని పూర్తిగా నివారించడానికి స్పెష ల్‌డ్రైవ్‌ నిర్వహించి అనుమానంవచ్చిన ప్రదేశాల్లోసోదాలు నిర్వహిస్తామన్నారు. దీని కోసం ప్రత్యేకటీం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఏడు కేసుల్లో 11మందినిఅరెస్టు చేశామన్నారు. ఆరుకేసులలో3112కిలోల గంజాయిని స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. అక్రమమార్గంలో ఎటువంటిమద్యం, డబ్బు లు, ప్రజలను ప్రలోభపెట్టే వస్తువులను జిల్లాకు రాకుండా వివిధశాఖల సమన్వయంతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. యువత నిషేధిత మత్తు పదార్థా లకు బానిసలుగా మారి భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దన్నారు. విద్యార్థులు, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంంబ సభ్యులలో ఎవరైనా మత్తుపదార్థాలకు బానిసలైతేవారి వివరాలను 8712670523కి ఫోన్‌చేసి తెలియజేయాలన్నారు. వారికి డీఅడిక్షన్‌ సెంటర్‌ ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహించి మత్తు పదార్థాలను మానిపించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనవెంట డీఎస్పీ సదయ్య, సీఐ రాణాప్రతాప్‌, సతీష్‌,ఎస్సై ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:11 PM

Advertising
Advertising